E-Paper
Advertisement

వాహనాదారులకు బిగ్ అలర్ట్.. వాటితో రోడ్లపై తిరిగితే బుక్కయినట్టే, నేరుగా జైలుకే

వాహనాదారులకు బిగ్ అలర్ట్.. వాటితో రోడ్లపై తిరిగితే బుక్కయినట్టే,  నేరుగా జైలుకే
Advertisement

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో వాహనదారులకు బిగ్ అలర్ట్. నకిలీ అనధికారిక వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ ప్లేట్లతో తిరిగే వాహనాలపై ఫోకస్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. గడిచిన వారంలో 10 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పొరపాటున నకిలీ నెంబర్ ప్లేట్‌తో వాహనాలపై తిరిగే నేరుగా జైలుకి వెళ్లడం ఖాయం.

హైదరాబాద్ సిటీలో వాహనాదారులకు బిగ్ అలర్ట్

Advertisement

తెలంగాణలోని హైదరాబాద్ సిటీలో నకిలీ, అనధికార వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లపై ఫోకస్ చేశారు పోలీసులు. ముమ్మరంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ సిటీలో గత వారం 10 కేసులు నమోదు అయ్యాయి. స్థానికుల ఫిర్యాదుల మేరకు ట్రాఫిక్ విభాగం ఈ చర్యలు చేపట్టింది.

ముఖ్యంగా మెహదీపట్నం, మహంకాళి, టోలిచౌకి, గుడి మల్కాపూర్, అంబర్‌పేట్, చత్రినాక, సంతోష్‌నగర్, సనత్‌నగర్, సైఫాబాద్ సహా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయా కేసులు నమోదు చేశారు. వాహనాల అసలు గుర్తింపును దాచిపెట్టి ట్రాఫిక్ రూల్స్ , చలానాల నుంచి తప్పించుకోవడానికి కొందరు నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.

Advertisement

నకిలీ నెంబర్ ప్లేట్లతో రోడ్లపై తిరిగితే నేరుగా జైలుకే

ఇలాంటి మోసాలకు పాల్పడితే వాహనాలను సీజ్ చేయడం, వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.అధీకృత రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పౌరులకు సూచించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ జూన్ నెల ఆరంభలో ఆపరేషన్ కవచ్‌ పేరిట తనిఖీలు చేపట్టారు.

కమిషనర్ వాహనాలను స్వయంగా తనిఖీ చేశారు. ఈ డ్రైవ్‌లో దాదాపు 2,149 నకిలీ నంబర్ ప్లేట్ల వాహనాలను సీజ్ చేశారు. కొందరు వ్యక్తులు నంబర్ ప్లేట్లను మార్చడం వల్ల చలాన్ల నుంచి సులభంగా తప్పించుకుంటున్నారు. ఫలితంగా అమాయక పౌరులకు తప్పుడు ఈ-చలానాలు వెళ్తున్నాయి.

ALSO READ: తుంగభద్ర నదీ జలాల వివాదం.. కేంద్రం రంగంలోకి దిగాల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

ఆ తరహా సమస్యలు శాంతిభద్రతలకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ విషయాన్ని సీపీ స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో నగరంలోని వాహనదారులు రవాణా శాఖ ఆమోదించిన నెంబర్ ప్లేట్లను వాడాలన్నారు. అదే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు అధికారులు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×