E-Paper
Advertisement

Telangana Weather Report: మార్చిలో మండుతున్న ఎండలు.. జర జాగ్రత్త..!

Telangana Weather Report: మార్చిలో మండుతున్న ఎండలు.. జర జాగ్రత్త..!
Advertisement

Telangana Weather Report: ఈ సారి సమ్మర్‌లో ఎండలు మండిపోతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా మార్చి రెండో వారంలోనే సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండ వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ఉక్కపోత చికాకు తెప్పిస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావంతో.. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. గత ఏడాదితోపోలిస్తే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణాలోని ప్రస్తుతం ఒకటి రెండు చోట్ల 39డిగ్రీలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో మరింత తీవ్రతరం కానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి.

తెలంగాణాలో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తల మడుగులో 40.5 డిగ్రీలు, నల్గొండ లో 40.9 డిగ్రీలు, సిద్ధిపేటలో 40.8, నిజామాబాద్ లో 40.5, నిర్మల్ జిల్లాలో 40.4, జగిత్యాలలో 40.5, సంగారెడ్డి జిల్లాలో 40.3, మెదక్ జిల్లాలో 38.7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం.

Advertisement

Also Read: ఇక నుంచి టీజీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.

ఈనేపథ్యం లో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఎండలు మండి పోతుండటం, ఉక్కపోత, వేడిగాలుల కారణంగా విద్యుత్ వినియోగం ఎక్కువ అయిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తినే ఆహారంలో వీలైనంత వరకూ నీటిశాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఏదేమైనా గతేడాది కంటే ఈ ఏడాది  మాత్రం ఎండలు మామూలుగా ఉండవని తెలుస్తోంది. ఇందుకు మార్చి నెలలో సుర్రుమనిపిస్తున్న ఎండలే ట్రైలర్ లా అనిపిస్తున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సూరీడు ఇంకెంత నిప్పులు కక్కుతాడో అని ప్రజలు తలచుకుంటేనే భయంగా ఉంటుంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×