E-Paper
Advertisement

Telangana- AP: తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయతీపై.. సుప్రీంకోర్టులో విచారణ

Telangana- AP: తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయతీపై.. సుప్రీంకోర్టులో విచారణ
Advertisement

Telangana- AP Water Dispute: ఇవాళ సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ జరగనుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్‌ పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుందని వాదన వినిపించనుంది.

ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ కేసుపై కేవియట్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ఉద్దేశాలతోనే.. ఈ కేసును ముందుకు తెచ్చిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెలంగాణ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు.

Advertisement

గతంలో కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య.. నీటి పంపకాలు వివాదాస్పదమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత ఒత్తిడికి గురిచేసేలా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

మరోవైపు ఈ వివాదం రెండు రాష్ట్రాల ఆర్ధిక ప్రగతి కూడా ప్రశ్నార్ధకంగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలాగైనా ఆపాలని ప్రయత్నం చేస్తోంది. ఏపీ ప్రతిపాదనలు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలను ఉల్లంఘిస్తాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read: ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. హరీష్ రావు విచారణకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

గత కొద్దిరోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ సీనియర్ న్యాయవాది సంఘ్వీతో భేటి అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర హక్కులను కాపాడేందుకు బలమైన వాదనలు వినిపించాలని సీఎం సూచించారు. ఈ భేటీలో ప్రాజెక్టు ప్రతికూలతలు వివరంగా చర్చించారు. సింఘ్వీ అనుభవం ఈ కేసులో తెలంగాణకు లాభదాయకంగా మారుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×