E-Paper
Advertisement

Telangana Workers : పొట్టచేత పట్టుకుని గల్ఫ్ వెళ్లిన కార్మికులు.. చేతులు ఎత్తేసిన కంపెనీ..

Telangana Workers : పొట్టచేత పట్టుకుని గల్ఫ్ వెళ్లిన కార్మికులు.. చేతులు ఎత్తేసిన కంపెనీ..
Advertisement

Telangana Workers : పొట్టచేత పట్టుకుని.. ఉన్న ఊరు, కన్నవారిని వదిలి రాష్ట్రం కాని రాష్ట్రం దేశం కాని దేశం వెళ్లిన కార్మికులు గల్ఫ్ లో నానా అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల ఒప్పందం పై కార్మికులకు వీసాలు మంజూరు చేసింది. కానీ పనిలేదంటూ ఏడాదికే ఇంటికి వెళ్లాలని చేతులు ఎత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేసేదేంలేక స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఖతార్‌ దేశంలోని ఏషియానా కంపెనీలో క్లీనింగ్‌, సప్లయి పనులు చేసేందుకు నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని గాంధీనగర్‌, ఖానాపూర్‌కు చెందిన 350 మంది పని కోసం వెళ్లిన గల్ఫ్‌ కార్మికులను స్వదేశాలకు వెనక్కి వెళ్లిపోవాలని కంపెనీ తెలిపిందని అందులో పనిచేస్తున్న కూలీలు వాపోయారు. డిసెంబరు 31 నుంచి తమకు పనిలేదని చెప్పింది. జనవరి 1 నుంచి ఖాళీగా ఉంటున్నామని కార్మికులు పేర్కొన్నారు. ఈ నెల 10న ఖాళీ చేసి వెళ్లిపోవాలని కంపెనీ విమాన టికెట్లను సిద్ధం చేసిందని తెలిపారు.

Advertisement

ఆ దేశం 2022లో ఫిఫా ప్రపంచకప్‌ పోటీల సందర్భంగా కార్మికులు అవసరమని వీసాలు మంజూరు చేసింది. ఇక్కడ ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల వరకు రెండేళ్ల వర్క్‌ పర్మిట్‌ వీసా పేరుతో వసూలు చేశారు. కానీ సంవత్సరానికే ఇంటికి వెళ్లిపోవాలని కంపెనీ చెప్పింది. “ఎన్నో ఆశలతో ఖతార్‌కు వచ్చాం. కంపెనీ ప్రతినిధులు కనీసం మా బాధను వినిపించుకునే సమయం ఇవ్వకుండా వెళ్లిపోవాలంటున్నారు” అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉపాధి మార్గం చూపాలని కార్మికులు విన్నవించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×