E-Paper
Advertisement

గిరిజన గురుకులాల్లో దారుణం.. 20 ఏళ్లు అయినా మినిమం పే స్కేల్ నో..?

గిరిజన గురుకులాల్లో దారుణం..  20 ఏళ్లు అయినా మినిమం పే స్కేల్ నో..?
Advertisement

Guest Lecturers: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో దశాబ్దాల కాలంగా విద్యాబోధన చేస్తున్న పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ గెస్ట్ లెక్చరర్లు, టీచర్ల పరిస్థితి “దీపం ఉన్నా చీకటి”లా మారింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న తమ బతుకులకు మాత్రం భద్రత కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
​తెలంగాణ గిరిజన గురుకుల ఫుల్ టైమ్ గెస్ట్, పార్ట్ టైమ్ లెక్చరర్స్ ,టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలనీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు.ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చారని, ఇప్పటికీ
నెరవేర్చక పోతే ఎట్లా? అంటూ యూనియన్ నేతలు ఫైర్ అవుతున్నారు.

​ప్రధాన సమస్యలు ఇవే..

​దాదాపు 20 ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో, ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా వీరు పని చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించిన ప్రభుత్వం, గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న తమను మాత్రం విస్మరించడం పట్ల సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఇప్పటికైనామినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ టీచర్లు, లెక్చరర్లకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలనీ సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నారు.దీనితో పాటు విధి నిర్వహణలో ఉంటూ మరణించిన పార్ట్ టైమ్, గెస్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని లెక్చరర్స్ కోరుతున్నారు.​”తాము గిరిజన విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాము. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి, మా కుటుంబాలను ఆదుకోవాలని సవినయంగా కోరుతున్నాము” అని గెస్ట్ లెక్చరర్స్ పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: Kerala Elections: కేరళ ఫలితాల్లో రేవంత్ మార్క్.. పనిచేసిన తెలంగాణ ఫార్ములా.. కాంగ్రెస్ ఖాతాలో మరో స్టేట్!

రెగ్యులరైజేషన్ కొరకు డిమాండ్..

​తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ గెస్ట్ లెక్చరర్ కి గత ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఈ నేపథ్యంలోనే 2023 ఎన్నికల సమయంలో గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ కాంగ్రెస్ పార్టీ నేతలను రెగ్యులరైజేషన్ కొరకు డిమాండ్ చేశారు. పాజిటివ్ కోణంలో స్పందించినకాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదని సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాలనీ, లేకపోతే సర్కార్ బై పోరాడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read: బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. తెలంగాణలోనూ ఎగిరేది కమలమే, రామచంద్రరావు ధీమా వ్యక్తం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×