E-Paper
Advertisement

బీజేపీ హిందూత్వానికి రేవంత్ ‘సనాతన’ చెక్.. అసలు వ్యూహం ఇదేనా?

బీజేపీ హిందూత్వానికి రేవంత్ ‘సనాతన’ చెక్.. అసలు వ్యూహం ఇదేనా?
Advertisement

Telangana: భక్తితో గుళ్లకు వెళ్లడం కామనే. కానీ ఇప్పుడు యుక్తితో ..పొలిటికల్‌ భుక్తి కోసం నడుస్తోన్న టెంపుల్‌ రన్‌ తెలంగాణలో ఆసక్తి రేపుతోంది. గాడ్‌ మావాడనంటే , గాడ్‌ మావాడూ అంటూ రాజకీయం గుడి చుట్టూ తిరుగుతోంది. ముల్లును ముల్లుతోనే తీయాలనే లాజిక్‌తో బీజేపీ హిందూత్వ ఎజెండాకు చెక్‌ పెడుతోంది కాంగ్రెస్‌. దేవుడు అందరివాడు సరే.. కానీ దేవుళ్లను కొందరే ఓన్‌ చేసుకోవడం ఏంటి? పరమాత్మ ఏమైనా కొందరికే పేటెంటా?! ఐనా రాజకీయ భజనలతో ఎక్కడైనా ఓట్లు ,సీట్లు రాలుతాయా? రాల్చుకోవాలనే వ్యూహంతో ఖద్దర్‌ ఎప్పుడో కట్టర్‌ ముసుగు వేయనే వేసింది కదా. అయోధ్య నిర్మాణాన్ని సాకారం చేశాం. జ్ఞానవాపిలో కూడా కాషాయ జెండా ఎగరేస్తామంటోంది బీజేపీ.

తెలంగాణ ఆలయాలపై స్పెషల్‌ ఫోకస్‌

Advertisement

హిందూత్వ ఎజెండా వెనుక బీజేపీ మన్‌ కీ బాత్‌ ఏంటో బహిరంగ రహస్యమే. ఐతే కాషాయ కట్టర్‌ వ్యూహాలకు చెక్‌ పెట్టేలా కాంగ్రెస్‌ సనాతన పథ్‌ అస్త్రానికి పదును పెడుతోంది. తెలంగాణ ఆలయాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెపట్టిన రేవంత్‌ సర్కార్‌ , యాదగిరి గుట్ట..భద్రాచలం.. బాసర, వేములవాడ, కొండగట్టు.. ఇలా చారిత్రక ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తోంది. బాసర టు భద్రాచలం.. టెంపుల్‌ కారిడార్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తోంది . నెవర్‌ బిఫోర్‌.. ఎఫర్‌ ఆఫ్టర్‌ అనే రేంజ్‌లో తెలంగాణ మహాకుంభమేళ మేడారం జాతరను ఘనంగా నిర్వహించారు.

Also Read: యాదగిరిగుట్ట బోర్డు చిచ్చు.. తగ్గేదే లేదంటున్న రాజగోపాల్ రెడ్డి.. అధిష్ఠానం వద్దకు చేరిన లొల్లి!

Advertisement

వేద పాఠశాలలు ఏర్పాటు

రికార్డు స్థాయిలో సమ్మక్క సారలమ్మ సన్నిధిని ఆధునీకరించి అడవి ఒడికి కొత్త వెలుగును తెచ్చింది రేవంత్‌ ప్రభుత్వం. అలాగే వేద పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది. ఆలయాల అభివృద్ధితో పాటు గో సంరక్షణ కోసం 360 కోట్లతో అధునాతన గోశాలలను నిర్మిస్తోంది. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని భావిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అది నిజమేనా? రాజకీయాలకు అతీతంగా ప్రధానిని ఆహ్వానిస్తున్నారా? కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కార్డియల్‌ రిలేషన్స్‌ వున్నాయనే సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారా? లేదంటే సనాతనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదని బీజేపీకి స్ట్రాంగ్‌ మెసేజ్‌ ఇవ్వడమే అసలు వ్యూహమా? అనే చర్చ నడుస్తోందిప్పుడు. బీజేపీ హిందూత్వ ఎజెండాకు చెక్‌ పెట్టేలా సనాతన్‌ మార్గ్‌తో తన మార్క్‌ చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×