E-Paper
Advertisement

TG SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వెల్లడి, 92 శాతం ఉత్తీర్ణత

TG SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వెల్లడి, 92 శాతం ఉత్తీర్ణత
Advertisement

TG SSC Result 2025: తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. రవీంద్రభారతిలో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించింది. గతేడాది కంటే 1.47 శాతం అధికం అన్నమాట.

గురుకులాల్లో 98.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ఆశ్రమ పాఠశాలల్లో 95శాతంగా ఉంది. ప్రైవేటు పాఠశాలలు 94.21 శాతం ఉత్తీర్ణత సాధించింది. గతేడాది కంటే ఇది నాలుగు శాతం ఎక్కువ. ఈసారి గ్రేడింగ్‌తోపాటు విద్యార్థుల మార్కులను విడుదల చేసింది ప్రభుత్వం.

Advertisement

ఈ ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది. 99.29 శాతంతో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 99.09 శాతంతో సంగారెడ్డి జిల్లా రెండో స్థానం సాధించింది. 73.97 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. జూన్ 3 నుంచి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం దరఖాస్తుల స్వీకరణ మే 17 వరకు ఉండనుంది.

విద్యార్థుల మోమోలలో సబ్జెక్టుల వారీగా ఉన్నాయి. గ్రేడ్‌ల పలు ఎంట్రన్స్ పరీక్షలకు వెయిటేజికి ఇబ్బందిగా మారకుండా మళ్లీ మార్కుల పద్ధతి తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.  ఫలితాలను విద్యార్థులు ఈ కింది వెబ్ పోర్టల్‌లో చూడవచ్చు.  results.bse.telangana.gov.inbse.telangana.gov.in

Advertisement

ALSO READ: తెలంగాణ మహిళలకు మరో పథకం, ఆలస్యం చేయొద్దు, వెంటనే అప్లై చేయండి

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 2,58,895 మంది బాలురు కాగా, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. 2,650 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం ఆరు సబ్జెక్టులు ఉండనున్నాయి. అందులో రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్ కు 20 మార్కులు ఓవరాల్ గా సబ్జెక్టుకు 100 మార్కులన్న మాట.

హిందీ సబ్జెక్టుకు రాత పరీక్షలో 16 కాగా, పాస్ మార్కులు 20గా ఉంది. సబ్జెక్టులకు పాస్ మార్కులు 35. ఈ ఏడాది టెన్త్‌లో ఇంటర్నల్స్‌ రద్దు చేయాలని ఆలోచన చేసింది. ప్రభుత్వం నిర్ణయం ఆలస్యం కావడంతో కంటిన్యూ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్స్ ఉండవన్నది అధికారుల మాట.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×