// // SSC Exams 2026: టెన్త్ పరీక్షల్లో సెల్ఫ్​ సెంటర్ వివాదం -->
E-Paper
Advertisement

SSC Exams 2026: టెన్త్ పరీక్షల్లో సెల్ఫ్​ సెంటర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డీఈవో..!

SSC Exams 2026: టెన్త్ పరీక్షల్లో సెల్ఫ్​ సెంటర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డీఈవో..!
Advertisement

SSC Exams 2026: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు శనివారం మొదలయ్యాయి. కాగా తొలిరోజు అంతటా ప్రశాంతంగా జరిగినా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్ పల్లిలో విద్యార్థులకు సెల్ఫ్ సెంటర్ వేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కన్ఫ్​యూజన్ నెలకొంది. ఈ కన్ఫ్యూజన్ కు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖాధికారి క్లారిటీ ఇచ్చారు. జిల్లా పరిధిలో మొత్తం 237 సెంటర్లు ఉన్నాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో జోన్ల వారీగా విద్యార్థులకు సాఫ్ట్ వేర్ సహాయంతో జంబ్లింగ్ పద్ధతిలో స్కూళ్లు కేటాయించినట్లు తెలిపారు.

కూకట్ పల్లి న్యూ ఎరా స్కూల్‌లో..

కూకట్ పల్లి జోన్ పరిధిలో 4 సెంటర్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మొత్తం 13 పాఠశాలలకు చెందిన 857 మందికి సాఫ్ట్ వేర్ సహాయంతో జంబ్లింగ్ పద్ధతిలో స్కూళ్లు కేటాయించినట్లు తెలిపారు. అందులోభాగంగా కూకట్ పల్లి న్యూ ఎరా స్కూల్ లో మొత్తం టెన్త్ విద్యార్థులు 337 మంది ఉండగా వారందరిలో 80 మందికి అదే స్కూల్ సెంటర్ కేటాయించినట్లు తెలిపారు. సాఫ్ట్ వేర్ జంబ్లింగ్ విధానం వల్ల ఈ ప్రక్రియ జరుగుతుందని స్పష్టంచేశారు. అంతేకాకుండా ఈ పరీక్ష కేంద్రానికి ఆ పాఠశాల సిబ్బంది కాకుండా పూర్తిగా ప్రభుత్వ ఉపాధ్యాయులను పరీక్షల నిర్వహనకు కేటాయించినట్లు స్పష్టంచేశారు. నలుగురు సిట్టింగ్ స్క్వాడ్లు, రెవెన్యూ శాఖ సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకవలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు స్పష్టంచేశారు. విద్యార్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని సూచించారు.

Advertisement

Also Read: Instagram No Privacy: ఇన్‌స్టాగ్రామ్ ఇకపై నో ప్రైవెసీ? మీ చాట్స్‌ను చదువుతున్న మెటా.. కొత్త రూల్స్ ఇవే

కేసులు నమోదు కాలేదు..

రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి పరీక్​షకు రెగ్యులర్ విద్యార్థులు 99.65 శాతం మంది హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 786 మంది ఉండగా 160 మంది గైర్హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్(కాపీయింగ్) కేసులు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు సిబ్బందిని విధులకు దూరంగా ఉంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Also Read: KTR: మూసీ పునరుజ్జీవనం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×