E-Paper
Advertisement

Sports Meet: కేటీఆర్‌కు మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్.. ఎమన్నారంటే..?

Sports Meet: కేటీఆర్‌కు మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్.. ఎమన్నారంటే..?
Advertisement

Sports Meet: స్వేచ్ఛ బ్యూరో: మత్తు వదిలించుకోవడానికే మైదానంలోకి రమ్మంటున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడల్లో పాల్గొనబోమని ప్రకటించిన మాజీ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. మైదానంలోకి తాము రామంటూ కేటీఆర్ అంటుంటే ఏం చేయగలమన్నారు. ‘మావి వేరే గేమ్స్, కేటీఆర్‌వి మరో రకమైన గేమ్స్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎల్ బీ స్టేడియంలో శనివారం తెలంగాణలెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ -2026లో మంత్రిమాట్లాడారు. ఆర్ఎస్ వాళ్లు ఆడే గేమ్స్ పెట్టడం సాధ్యం కాదు కదా? అంటూ చురకలు అంటించారు. తాము ఫిట్ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నామని.. ఆరోగ్య తెలంగాణ ఉండాలని సీఎం ఆలోచన చేస్తున్నారని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వం..

ప్రజాప్రతినిధులు క్రీడలు ఆడడం వల్ల విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో పిల్లలకు డ్రగ్స్ వంటి ఆలోచనలు రాకుండా ఆటల వైపు మళ్లుతారనిపేర్కొన్నారు. మత్తు వదలని వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గత ప్రభుత్వం క్రీడలను పట్టించుకోకుండా విధ్వంసం చేసిందని మండిపడ్డారు. పదేళ్ళు క్రీడలకు నిధులు కేటాయించకుండా క్రీడలను ఆగం చేశారన్నారు. పదేళ్ళు రూ.400 కోట్లు కేటాయించి.. రూ.350 కోట్లు బీఆర్ఎస్ ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మాత్రం మూడేళ్ళలోనే రూ.1,470 కోట్ల నిధులు కేటాయించి క్రీడలపై ప్రభుత్వ ఆసక్తిని చాటిందన్నారు.

Advertisement

Also read: IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్ భూతం.. కోటీశ్వరులను సైతం రోడ్డున పడేసే యాప్స్ ఇవే..!

తెలంగాణను ఆటల్లో..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం రూ.360 కోట్లు, రెండవ సంవత్సరం రూ.464 కోట్లు, ఈ ఏడాది రూ.646 కోట్లు కేటాయించామన్నారు. ఆటలను కూడా రాజకీయ కోసం విమర్శలు చేయడం సరికాదని సూచించారు. తెలంగాణను ఆటల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. క్రీడల్లో తెలంగాణ బిడ్డలను ప్రోత్సహించేందుకు క్రీడా పాలసీని తీసుకువచ్చి ముందుకు పోతున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్ధుల ప్రతిభను వెలికి తీయడం కోసం సీఎం కప్ కార్యక్రమాన్ని రెండు ఎడిషన్ గా నిర్వహించామని వెల్లడించారు. సీఎం కప్ పోటీల్లో 7 లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారని, ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని తెలిపారు.

Advertisement

Also read: TGSRTC: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటణ.. మెట్రో, ఎంఎంటీఎస్‌తో ఆర్టీసీ దోస్తీ..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×