E-Paper
Advertisement

కుంభ మేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. సర్కార్ ప్లాన్ ఇదే..?

కుంభ మేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. సర్కార్ ప్లాన్ ఇదే..?
Advertisement

Godavari Pushkaralu: స్వేచ్ఛ బ్యూరో: గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు స్పీడప్ చేసింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తుంది. రోడ్లు సైతం వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో రోడ్లు వేయనున్నారు. అందుకు పంచాయతీరాజ్ శాఖ 99కోట్లతో 85 పనులు చేసేందుకు ప్రపోజల్స్ రెడీ చేసింది. ప్రభుత్వం అనుమతి రాగానే పనులు చేపట్టబోతున్నారు.

8 జిల్లాల్లో పుష్కరాలు

తెలంగాణలో గోదావరి 8 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. అందులో నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా సుమారు 283 కిలో మీటర్లు ప్రయానించి కొత్తగూడెం జిల్లా మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ 8 జిల్లాల్లో పుష్కరాలకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాల కోసం రోడ్లు నిర్మించబోతున్నారు. అందులో భాగంగానే వెయ్యికోట్లతో రోడ్లు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖ లు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నాయి. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి 99కోట్లతో పనులు గుర్తించారు. ఆ పనుల వివరాలను ప్రభుత్వానికి అందజేశారు.

Advertisement

Also Read: ఒక్క వీడియోతో మెక్సికోను షేక్ చేస్తున్న రాజమౌళి!

కుంభమేళాతో పనులు

ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో నిర్వహించిన కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సైతం సిద్ధం చేసింది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతుంది. కుంభమేళాతో పనులు చేసిన ఎర్నెస్ట్ యంగ్(ఈవై) కన్సల్టెన్సీకి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సర్వే సైతం చేసింది. పుష్కరాలు విజయం చేసేందుకు ప్రభుత్వం సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ గా ఎంపిక చేసింది. ఆ సబ్ కమిటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ , ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సభ్యులుగా నియమించింది. వీరు పనుల పర్యవేక్షణ చేయనున్నారు.

శాశ్వతంగా రోడ్ల నిర్మాణం

Advertisement

గోదావరి పుష్కరాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికే దేవాదాయ, టూరిజం, పంచాయతీరాజ్​ తదితర శాఖల అధికారులు ప్రయాగారాజ్​కు వెళ్లి మహాకుంభమేళాకు అక్కడ అనుసరించిన విధానాలను అధ్యయనం చేశారు. శాశ్వతంగా రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. అందుకు తగిన విధంగానే ప్రణాళికలు రూపొందించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రాథమిక అంచనాలతో ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ఏ గ్రామం, రోడ్ల పొడవు.. తదితర వివరాలతో కూడిన అంశాలను అందులో పొందుపర్చినట్లు సమాచారం. ప్రభుత్వ అనుమతి రాగానే పనుల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Also Read: గద్వాల్లో పట్టపగలే ఇసుక మాఫియా అరాచకం.. పట్టించుకోని అధికారులు..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×