E-Paper
Advertisement

ఉపాధి హామీ పనుల్లో దొంగ హాజర్లకు చెక్.. విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు!

ఉపాధి హామీ పనుల్లో దొంగ హాజర్లకు చెక్.. విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు!
Advertisement

Vigilance Committees: స్వేచ్చ బ్యూరో: ఉపాధి హామీ పనులలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, స్వశక్తి మహిళ, ఉపాధి ఫీల్డ్ ఆఫీసర్, యువజన సంఘం నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలి. కమిటీ సభ్యులు వారంలో ఒకరోజు ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించాలి. కూలీల హాజరు, జరుగుతున్న ప్రాధాన్యత పనుల పురోగతి, కూలీల వేతనాల చెల్లింపు వివరాలను పరిశీలించాలి. జరుగుతున్న పనులలో ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నట్లయితే సంబంధిత ఉన్నతాధికారులకు కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయాలి. చాలా మటుకు గ్రామాలలో విజిలెన్స్ కమిటీల ఎంపిక కాలేదు. దీంతో గ్రామాలలో గ్రామ రాజకీయ నాయకుల జోక్యం ఉపాధి పనులలో పెరుగుతోంది.

పనితీరు ఇలా..

ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా ఉపాది హామీ పథకంలో భాగంగా నిర్దేశించిన పనులకు గ్రామాలలో ఉపాధి కల్పన సంబంధిత అధికారులు చేపడతారు. పనులు ప్రాధాన్యత క్రమంలో కొనసాగిస్తుంటారు. అందులో భాగంగా ఉదయం వేళలో పని ప్రదేశం దగ్గర కూలీల ముఖ హాజరు తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగు గంటల పని అనంతరం మరోసారి యాప్ లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆరోజు పని దినం కూలీలకు విజయవంతంగా నమోదవుతుంది. ఇక్కడే కొందరు గ్రామ స్థానిక సర్పంచ్ అధికారి పార్టీ నాయకులు, తమకు సంబంధించిన కుటుంబ సభ్యులకు యాప్ లో హాజరు నమోదు చేసుకున్న అనంతరం పనిచేయకుండా పని ముగింపు దశలో వచ్చి మరోసారి హాజరు పొంది ఉపాధి డబ్బు పొందుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఫీల్డ్ ఆఫీసర్లు సైతం వారికి వంత పాడుతూ సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.కూలీలు సైతం ఖచ్చితమైన నిర్దేశించిన పనులు చేయకుండా తూతూ మంత్రంగా పనులు చేస్తూ సమయం కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. వేసవిలో వేసే పనులు లేకపోవడంతో గ్రామంలోని అధిక శాతం ప్రజలు కుటుంబంలో జాబ్ కార్డు కలిగిన వారు ఉపాధి కూలీ పనుల వైపు మొగ్గు చూపుతున్నారు.

Advertisement

Also read: తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో కొందరు లీడర్ల రహస్య దోస్తీ!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూలీల సంఖ్య (లక్షల్లో)

మహబూబ్ నగర్ 2.23
నారాయణపేట 1.87
నాగర్ కర్నూల్ 3.76
వనపర్తి 2.79
గద్వాల 3.30

Advertisement

Also read: నేటి నుండి జూన్ 30 వరకు మెదక్ జిల్లాలో సెక్షన్ 30, 30(ఎ) అమలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×