E-Paper
Advertisement

మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్.. ఆర్టీసీ హామీలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన!

మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్.. ఆర్టీసీ హామీలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన!
Advertisement

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లు, ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఆయన ఒక సుదీర్ఘమైన ప్రెస్ నోట్ విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని, ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

జూలై జీతాలతోనే పీఆర్సీ చెల్లింపులు

Advertisement

ఆర్టీసీ కార్మికులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 11 శాతం పీఆర్సీ (PRC) అమలుపై మంత్రి స్పష్టతనిచ్చారు. వచ్చే జూలై నెల జీతాల నుంచే ఈ పెంచిన పీఆర్సీని కార్మికులకు అందజేయనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.

29 డిమాండ్ల పరిష్కారం.. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

Advertisement

కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచిన 32 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 29 అంశాల పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న మిగిలిన మూడు కీలక అంశాలపై కూడా ప్రస్తుతం సానుకూల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అలాగే, ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.

Also Read: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి!

విలీన కమిటీలో కార్మికులకు చోటు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం సందర్భంగా తలెత్తిన సాంకేతిక, చట్టపరమైన ఇబ్బందులను అధ్యయనం చేశామని, తెలంగాణలో అలాంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచే గుర్తింపు సంఘం ప్రతినిధులనే విలీన కమిటీలో భాగస్వామ్యం చేస్తామని, విధివిధానాల రూపకల్పనలో కార్మిక నేతలకు పూర్తి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

కొంతమంది కార్మిక సంఘాల నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. విలీన ప్రక్రియను వివాదాస్పదం చేయవద్దని ఆయన కోరారు. ఇలాంటి అసత్య ప్రచారాలను, పుకార్లను కార్మికులు నమ్మవద్దని, సంస్థ శ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×