E-Paper
Advertisement

Telangana Vision 2047: వచ్చే నెలలో గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల వేటకు రెడీ అయిన రేవంత్ సర్కార్

Telangana Vision 2047: వచ్చే నెలలో గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల వేటకు రెడీ అయిన రేవంత్ సర్కార్
Advertisement

Telangana Vision 2047: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను రూపొందిస్తోంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బుధవారం ప్రజాభవన్‌లో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక వార్ రూమ్ సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను ఒక పండుగలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దీనికి దేశవిదేశాల నుంచి ప్రముఖ కంపెనీల సీఈఓలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) సహకారంతో రూపొందిస్తున్న ఈ డాక్యుమెంట్ ద్వారా 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆర్థిక వృద్ధిని (GDP) 11 శాతం నుంచి 13 శాతానికి పెంచడం ద్వారా ఆర్థిక, పారిశ్రామిక, సర్వీస్ సెక్టార్లలో అద్భుత ఫలితాలు సాధించాల్సి ఉందని డిప్యూటీ సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఫార్మా, ఐటీ రంగాలు, తక్కువ ధరకే లభించే నైపుణ్యం కలిగిన మానవ వనరులు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ముఖ్యంగా రూ. 36 వేల కోట్లతో చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణం రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తుందని, ఔటర్ మరియు రీజినల్ రింగ్ రోడ్ల మధ్య భారీ ఎత్తున ఇండస్ట్రియల్ క్లస్టర్లు రానున్నాయని తెలిపారు. ఈ అంశాలన్నీ విజన్ డాక్యుమెంట్‌లో పకడ్బందీగా పొందుపరచాలని సూచించారు.

Advertisement

ప్రజా ప్రభుత్వం డిసెంబర్ 9న రెండవ సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, భవిష్యత్ తరాలకు మేలు చేసే పునాదులు వేస్తున్నామని భట్టి పేర్కొన్నారు. గత రెండేళ్లలో రోడ్లు మరియు భవనాల శాఖలో రూ. 85 వేల కోట్ల విలువైన పనులు, మహిళలకు రూ. 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడం వంటి విజయాలను విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు. రాబోయే రెండు రోజుల్లో కార్యదర్శులంతా తమ శాఖల మంత్రులతో చర్చించి, సీఎం రేవంత్ రెడ్డి తుది ఆమోదం కోసం డాక్యుమెంట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు.

Read Also: Gram Panchayat Elections: తెలంగాణలో మోగిన పంచాయతీ నగారా? ఓటర్ల జాబితాపై కీలక ప్రకటన!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×