E-Paper
Advertisement

తెలంగాణ సర్కార్‌కి మరో అరుదైన గౌరవం.. రూ.200 కోట్ల బహుమతి సొంతం!

తెలంగాణ సర్కార్‌కి మరో అరుదైన గౌరవం.. రూ.200 కోట్ల బహుమతి సొంతం!
Advertisement

Maternal Healthcare: స్వేచ్చ బ్యూరో: మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రం సాధించిన ఫలితాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.200 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసిందని సోమవారం ఆమె వెల్లడించారు.

నవజాత శిశు సంరక్షణ..

ఈ నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా-శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన హాస్పిటళ్లలో నవజాత శిశు సంరక్షణ విభాగాల విస్తరణ, లేబర్ రూములు, ఆపరేషన్ థియేటర్లను జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరణ, మిడ్‌వైఫరీ-లెడ్ కేర్ యూనిట్లు, కంగారూ మదర్ కేర్ వార్డులు, లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఏర్పాటు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Also read: El Niño: ఎల్ నినోను ఎదుర్కొనేందుకు.. మీ జిల్లాకు ఇన్చార్జ్ అధికారి ఎవరో తెలుసా..?

సర్టిఫికేషన్ పొందేలా..

అలాగే అధిక ప్రసవాలు జరిగే ఆసుపత్రుల్లో తల్లి, గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని అత్యాధునిక పరికరాలతో పర్యవేక్షించే వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా తీర్చిదిద్ది, నేషనల్ క్వాలిటీ అష్యూరన్స్ సర్టిఫికేషన్ పొందేలా మౌలిక వసతుల కల్పన, వైద్య సేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.ఈ ప్రోత్సాహక నిధులు రాష్ట్రంలో మాతృ మరణాలు, నవజాత శిశు మరణాలను మరింత తగ్గించడంతో పాటు ప్రతి ప్రభుత్వ హాస్పిటల్‌లో నాణ్యమైన మాతా-శిశు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఎంతగానో ఉపయోగపడుతాయని డాక్టర్ సంగీత సత్యనారాయణ పేర్కొన్నారు.

Advertisement

Also Read: Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×