E-Paper
Advertisement

Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖకు.. మరో అంతర్జాతీయ స్థాయి ఘనత..!

Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖకు.. మరో అంతర్జాతీయ స్థాయి ఘనత..!
Advertisement

Telangana Police: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ పోలీసులు మరో ఘనత సాధించారు. పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, పోలీసు ధృవీకరణలో అత్యుత్తమ పనితీరు కనబరిచారు. ఈ క్రమంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ 2025-26లో పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధృవీకరణలో విశిష్ట సేవలు అందించిన రాష్ట్ర పోలీసు సంస్థగా తెలంగాణ పోలీస్ శాఖను ఎంపిక చేసింది. ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు అవార్డును ప్రకటించింది.

అధికారిక లేఖ..

ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి డీజీపీ సీ.వీ.ఆనంద్ కు అధికారిక లేఖ అందింది. న్యూ ఢిల్లీలో ఈనెల 19న జరిగే కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా డీజీపీ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీసు ధృవీకరణ అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.

Advertisement

Also Read: Praja Palana: ప్రజా పాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ సూపర్ సక్సెస్.. రికార్డు స్థాయిలో నమొదైన విజయాలివే..?

నైపుణ్యానికి నిదర్శనం..

దీంట్లో తెలంగాణ పోలీసులు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడం వల్లే ఈ గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. ఈ అవార్డు తెలంగాణ పోలీసుల సేవా నిబద్ధతకు, వృత్తిపరమైన నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Also read: తలనొప్పితో జీవితం నరకంగా మారిందా? ఆ ఒక్క పొరపాటే ముఖ్య కారణం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×