E-Paper
Advertisement

Telangana Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు, కీలక ఆధారాలు సమర్పించిన సిట్.. ఇప్పుడేంటి?

Telangana Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు, కీలక ఆధారాలు సమర్పించిన సిట్.. ఇప్పుడేంటి?
Advertisement

Telangana Phone tapping case(Telangana news live): తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ కేసు సంబంధించిన కీలక ఆధారాలను మొత్తం మూడు బాక్సుల్లో న్యాయస్థానానికి సమర్పించారు దర్యాప్తు అధికారులు. అంతేకాదు మూడో ఛార్జిషీటును దాఖలు చేసింది. దర్యాప్తు అధికారి న్యాయస్థానానికి సమర్పించిన ఆధారాల్లో సీడీలు, పెన్ డ్రైవ్‌లు, ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు అందులో ఉన్నాయి. వీటికితోడు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌ల శకలాలు ఇచ్చేశారు.

అత్యంత సున్నితమైన కేసు కావడంతో తాము అందజేసిన వివరాలు బయటకు రాకుండా చూడాలంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిందితులెవరికీ వీటిని అందజేయకూడదని పేర్కొన్నారు అధికారులు.

Advertisement

ఈ కేసులో కీలక నిందితుడు ఏ 1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీప్ ప్రభాకర్‌రావు రాక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. తొలుత జూన్ 26న భారత్‌కు వస్తానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు వెల్లడించారు. తాజాగా సమర్పించిన మెమోలో తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే అరెస్టయిన ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావు రిమాండ్‌లో ఉన్నారు. 90 రోజల జ్యుడీషియల్ కస్టడీ ముగిసినా, న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేయలేదు. ఈ కారణంగా తమకు బెయిల్ మంజారు చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. మంగళవారం పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం విచారణను బుధవారం నాటికి వాయిదా వేసింది.

Advertisement

ALSO READ: కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన పవర్ కమిషన్

ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు వ్యవహారంలో ఆదేశాలు ఇచ్చినట్టు విచారణలో నిందితులు అంగీకరించిన విషయం తెల్సిందే. ఇప్పటికే దాదాపు 12 వరకు రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చినా, పోలీసులు వారిని ఇంకా విచారించాల్సి ఉందన్నారు. ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుల బెయిల్‌పై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×