E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు
Advertisement

Phone Tapping Case:తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సిట్‌లో సభ్యులుగా అంబర్‌కిషోర్‌ ఝా, ఎస్‌ఎం విజయ్‌కుమార్‌, రితురాజ్‌, నారాయన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కేఎస్‌ రావు, వెంకటగిరి, శ్రీధర్‌, నాగేందర్‌రావు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పలువురి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ కేసులో కీలక వ్యక్తులను విచారిస్తుంది.

కీలక దశకు కేసు

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ గురువారంతో ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితో గత వారం రోజులుగా సిట్ ఆయనను విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో.. సేకరించిన కీలక సమాచారాన్ని నివేదిక రూపంలో సిట్ అధికారులు సిద్ధం చేశారు.

సహకరించిన ప్రభాకర్ రావు

Advertisement

గత ఏడు రోజులుగా జరిగిన విచారణలో ప్రభాకర్ రావు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? డేటా ధ్వంసం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అనే కోణంలో అధికారులు ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణను హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందంతో సమీక్ష నిర్వహించిన సీపీ, కేసు పురోగతిపై చర్చించారు. ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను నివేదికలో పేర్కొన్నారు.

రేపు సుప్రీంలో విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించనుంది. వారం రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు చెప్పిన వివరాలు, సేకరించిన ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సిట్ బృందం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Also Read: Panchayat elections: సర్పంచ్ ఎన్నికలు.. ఎవరికెన్ని సీట్లు అంటే..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×