E-Paper
Advertisement

టీజీ ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల

టీజీ ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల
Advertisement

Tg open school exam fee details: చదువు మధ్యలో ఆగిపోయిందని బాధపడుతున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. టెన్త్ లేదా ఇంటర్ పూర్తి చేయలేదన్న లోటును తీర్చుకోవడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించనున్న ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను డైరెక్టర్ కే లింగయ్య ప్రకటించారు. గతంలో ఫెయిల్ అయిన వారు,అంతే కాకుండా పరీక్షలు రాయలేకపోయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫీజు వివరాలు ,అర్హతల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీజు చెల్లింపు వివరాలు!

Advertisement

ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజును అధికారిక వెబ్‌సైట్ (www.telanganaopenschool.org) ద్వారా లేదా టీజీ ఆన్‌లైన్ / మీ సేవా కేంద్రాల ద్వారా చెల్లించాల్సిందిగా సూచించారు. సెలవు దినాల్లో ఫీజు చెల్లించడానికి అవకాశం ఉండదు. అలాగే ఎలాంటి చలానా లేదా డీడీ చెల్లింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఫైన్ లేని సాధారణ గడువు: అభ్యర్థులు ఎలాంటి లేట్ ఫీజు లేదా జరిమానా లేకుండా ఆగస్టు 1 నుంచి 17 వ తేదీ వరకు తమ పరీక్ష ఫీజును నేరుగా చెల్లించుకోవడానికి అవకాశం కల్పించారు.

Advertisement

రూ.25 లేట్ ఫీజు : నిర్ణీత తేదీలోపు ఫీజు చెల్లించలేని వారు, పేపర్‌కు అదనంగా రూ. 25 చొప్పున ఫైన్‌తో ఆగస్టు 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించవచ్చు.

రూ. 50 లేట్ ఫీజు: పేపర్‌కు రూ. 50 చొప్పున జరిమానా చెల్లించి ఆగస్టు 25 నుంచి 29వ తేదీ వరకు ఫీజును క్లియర్ చేసుకోవచ్చు.

తత్కాల్ పద్ధతి: అత్యవసరంగా లేదా చివరి నిమిషంలో అప్లై చేసుకోవాలనుకునే వారి కోసం తత్కాల్ విధానాన్ని అందుబాటులో ఉంచారు. ఈ పద్ధతి ద్వారా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది.

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. ఎస్సెస్సీ (టెన్త్) ,ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజును ప్రతి పేపర్‌ ఆధారంగా లేదా బోర్డు నిర్దేశించిన స్టాండర్డ్ ఫీజు స్ట్రక్చర్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో ఎలాంటి లేట్ ఫీజు ఉండదు కానీ, గడువు దాటిన ప్రతిసారీ పేపర్‌కు రూ. 25, రూ. 50 చొప్పున జరిమానా పెరుగుతుంది. తుది గడువు ముగిసే లోపు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఈ ఫీజును చెల్లించవచ్చని స్పష్టం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×