E-Paper
Advertisement

Nurses Credit: నర్సింగ్ సిబ్బందిపై వేధింపులు ఆపండి.. కల్వకుంట్ల కవిత ఫైర్!

Nurses Credit: నర్సింగ్ సిబ్బందిపై వేధింపులు ఆపండి.. కల్వకుంట్ల కవిత ఫైర్!
Advertisement

Nurses Credit: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓ ప్రకటనలో.. నర్సింగ్ సిబ్బందిపై జరుగుతున్న క్రెడిప్ పాయింట్ల వేధింపులపై స్పందించారు. నర్సింగ్ సిబ్బంది మనో వేదనను అర్థం చేసుకోవాలని..  క్రెడిట్ పాయింట్ల పేరుతో వారిని వేధింపులకు గురి చేయొద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  డిమాండ్ చేశారు. క్వాలిఫైడ్ నర్స్ ల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ కు ఐదేళ్లలో 150 క్రెడిట్ పాయింట్లు సాధించి ఉండాలని కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఈ నిబంధనలు తెచ్చిన తర్వాత తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ వాటిపై కనీస అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో 80 వేల మంది నర్సింగ్ సిబ్బంది తమ రిజిస్ట్రేషన్ల రెన్యూవల్ కు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

క్వాలిఫైడ్ నర్స్ లు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి ఐదేళ్లలో 150 గంటల కంటిన్యూయింగ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ క్రెడిట్ అవర్స్ కలిగి ఉండాలనే నిబంధన తెచ్చినట్టు కూడా చాలా మందికి అవగాహన లేదన్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనపై తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అవగాహన కల్పించలేదని తనను కలిసిన పలువురు నర్సింగ్ సిబ్బంది వాపోయారని తెలిపారు. 150 రిజిస్ట్రేషన్ లు రెన్యూవల్ చేస్తామంటూ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వడం పూర్తిగా ఏకపక్షమే. నర్సింగ్ కేవలం వృత్తి మాత్రమే కాదు సేవ చేయడం. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల ప్రాణాల రక్షణ కోసం సేవలందించే నర్సింగ్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ల రెన్యూవల్ విషయంలో ఇలాంటి కఠిన నిబంధనలు సరికాదన్నారు.

Advertisement

ఉద్యోగాలు చేస్తూ నర్సింగ్ సిబ్బంది నెలకు కనీసం రెండు కాన్ఫరెన్స్ లకు హాజరయితే తప్ప నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల మేరకు క్రెడిట్ పాయింట్స్ సాధించడం సాధ్యం కాదన్నారు. కరోనా కాలంలో నర్సింగ్ కాన్ఫరెన్స్ లు నిర్వహించలేదనే విషయం తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఐదేళ్లకు 150 క్రెడిట్ పాయింట్ల విధానంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న నర్స్ లకు కనీస వేతనం రూ.20 వేలు అమలు చేస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నర్సింగ్ సిబ్బందిపై వేధింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Also Read:మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ నాగబాబు.. కోవా బన్ వ్యాపారికి రూ. 25వేల ఆర్థిక సాయం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×