E-Paper
Advertisement

Ponnam Prabhakar: మున్సిపల్ ఎన్నికల్లో.. గెలుపు కాంగ్రెస్ పార్టీదే.. మంత్రి పొన్నం ధీమా

Ponnam Prabhakar: మున్సిపల్ ఎన్నికల్లో.. గెలుపు కాంగ్రెస్ పార్టీదే.. మంత్రి పొన్నం ధీమా
Advertisement

Ponnam Prabhakar: తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలవబోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు పోలిసులతో ఘర్షణ పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులపై‌ దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ పోలీసులపై దౌర్జన్యానికి దిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు అబద్దాలను ప్రచారం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికలలో‌‌ ఓడిపోతున్నామన్న అసహనంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. అన్ని పేపర్లలోనూ మెుదటి బీజేపీ యాడ్స్ రూపంలో ఎన్నికల హామీలు ఇచ్చిందని చెప్పారు. వాటన్నింటినీ ఆ పార్టీ నేతలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పాలనను పట్టణ ఓటర్లు గుర్తించారని మంత్రి పొన్నం అన్నారు. ప్రభుత్వాన్ని ఎంత విమర్శించినా ప్రజలు‌ కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారని హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో 80 శాతానికి పైగా‌ మునిసిపాలిటీలు గెలవబోతున్నాం. తెలంగాణ కన్నుబడితే కొబ్బరి చెట్లు ఎండిపొతాయని‌ మాట్లాడినవారితో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇచ్చిన హమీలు నెరవేర్చాల్సిన బాధ్యత బీజేపీదే. కాబోయే ఛైర్మన్లు బీజేపీ ప్రకటన గురించి పోరాడుతారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక బీజేపీ నేతలదే’ అని పొన్నం చెప్పుకొచ్చారు.

Also Read: Front Load vs Top Load: వాషింగ్ మిషన్లలో ఎందుకీ తేడా? ప్రత్యేకతలు ఏంటి.. రెండింటిలో ఏది బెస్ట్?

కాగా, మున్సిపల్ పోలింగ్ సందర్భంగా హుస్నాబాద్ లోని నవ భారత్ హైస్కూల్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రజాస్వామ్య హక్కుకు నిదర్శనమని పేర్కొన్నారు.

Also Read: Air Coolers 50 Percent Off: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే టాప్ కంపెనీ కూలర్లు.. ఈ ఛాన్స్ వదులుకోవద్దు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×