E-Paper
Advertisement

TG Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. సాయంత్రం 5 గంటలకే డెడ్‌లైన్, ఇక తేల్చుకోవడమే..!

TG Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా.. సాయంత్రం 5 గంటలకే డెడ్‌లైన్, ఇక తేల్చుకోవడమే..!
Advertisement

TG Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈరోజు( ఫిబ్రవరి-3-2026) చివరి తేదీ కావడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 2వేల 996 వార్డులకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నేడు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఉపసంహరణ సమయం ముగిసిన వెంటనే.. అధికారులు వార్డుల వారీగా బరిలో నిలిచిన అభ్యర్థులను వడపోసి, ఫైనల్ లిస్టును సిద్ధం చేసే పనిలో నిమగ్నమవుతారు. ఈ రోజు రాత్రి లోపు లేదా రేపు ఉదయానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా తుది జాబితాను విడుదల చేస్తుంది.

Advertisement

స్క్రూటినీ తర్వాత అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 19వేల 608 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. పార్టీల వారీగా బీఆర్ఎస్(BRS) సుమారు 7,000 పైగా నామినేషన్లు. బీజేపీ (BJP) పార్టీ 3వేల కు పైగా నామినేషన్లు దాఖలు చేయగా.. ఇండిపెండెంట్లు 3వేల 700 కు పైగా అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో నిలిచారు.

ప్రతి ప్రధాన పార్టీకి రెబల్ అభ్యర్థులు పెద్ద సమస్యగా మారారు. టికెట్ దక్కని నేతలు స్వతంత్రులుగా లేదా ఇతర మార్గాల్లో నామినేషన్లు వేయడంతో పార్టీలు బుజ్జగింపుల పర్వానికి తెరలేపాయి. అయితే.. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టతనిచ్చింది. నిర్ణీత గడువులోగా పార్టీ తరపున ‘బి-ఫామ్’ (B-Form) సమర్పించిన వారినే అధికారిక అభ్యర్థులుగా గుర్తిస్తాము. మిగిలిన వారు స్వతంత్రులుగానే పరిగణించబడతారు అంటూ స్పష్టం చేసింది. ఈ నిబంధనతో పార్టీలు తమ అధికారిక అభ్యర్థులను ఖరారు చేసుకోవడానికి వీలు కలిగింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Advertisement

Also Read: ప్ర‌ధాని మోడీ క‌నుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ భూస్తాపిత‌మే..PCBని దేవుడు కూడా కాపాడ‌లేడు !

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×