E-Paper
Advertisement

Municipal Elections 2026: పురపాలక పోరులో ముగిసిన ఉపసంహరణ ప్రక్రియ.. ఎన్నికల నిర్వహణకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు!

Municipal Elections 2026: పురపాలక పోరులో ముగిసిన ఉపసంహరణ ప్రక్రియ.. ఎన్నికల నిర్వహణకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు!
Advertisement

Municipal Elections 2026:  రాష్ట్ర పురపాలిక పోరులో మరో ఘట్టం ముగిసింది. గత నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాల్టీలు, మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మూడు రోజుల పాటు దాదాపు 28 వేల 456 నామినేషన్లు స్వీకరించగా, వీటిలో దాదాపు 19608 నామినేషన్లను అర్హత కలిగిన వాటిగా గుర్తించారు. వీటిలో సుమారు 6701 నామినేషన్లు మంగళవారం సాయంత్రం విత్ డ్రా చేసుకున్నట్లు సమాచారం.

Also Read: Huzurabad Municipal: హుజూరాబాద్ మున్సిపల్ పీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: వొడితల ప్రణవ్!

ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు

Advertisement

దీంతో మున్సిపల్ పోరులో పోటీ పడనున్న అభ్యర్థుల సంఖ్య 12,993గా ఉన్నట్లు సమాచారం. 11న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని మున్సిపాల్టీల్లో, కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహించే దిశగా ఏర్పాట్లు చేస్తూనే, ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేసేందుకు, ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

ఈ నెల 13న కౌంటింగ్

ఈ నెల 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించినానంతరం 14న సభ్యుల ప్రమాణస్వీకారంతో పాటు చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లను ఎన్నుకోనున్నారు. దీనికి తోడు 16న అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను ఎక్స్ అఫియో సభ్యులుగా ఎన్నుకునేందుకు ఈ నెల 14 లోపు పరోక్ష ఎన్నికల నిర్వహణకు సమాచారం పంపాలని జిల్లా కలెక్టర్లకు అడిషనల్ కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Also Read: Nitin Nabin: నేడు తెలంగాణకు నితిన్ నబీన్.. పాలమూరు సభతో కమలం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×