E-Paper
Advertisement

రేపే తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్!

రేపే తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్!
Advertisement

Model Schools: స్వేచ్ఛబ్యూరో: రాష్ట్రంలో కొనసాగుతున్న 194 మోడల్ స్కూల్స్ లో 6వ తరగతిలో ప్రవేశాలతోపాటు, 7 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో సీట్లను భర్తీ చేయడం కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్టును ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

దరఖాస్తు గడువు..

6వ తరగతిలో ప్రవేశాల కోసం 208 పరీక్ష కేంద్రాలను, 7 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్ల కోసం నిర్వహించే పరీక్షకు 204 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మోడల్ స్కూల్స్ అడిష నల్ డైరక్టర్ శ్రీనివాసాదారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు గడువు ముగిసేనాటికి 37,216 మంది దరఖాస్తు చేసుకున్నారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం 23,958 మంది, 7వ తరగతిలో ప్రవేశాలకు 5117, 8వ తరగతిలో చేరడానికి 4709 మంది, 9వ తరగతిలో చేరడానికి 2820 మంది, 10వ తరగతిలో చేరడానికి 612 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Also Read: తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ అల‌జ‌డిని రేపిన‌.. బీజేపీ బిల్లులు…! వ్య‌తిరేకించిన‌ రేవంత్ రెడ్డికి మైలేజీ… మ‌ద్ద‌తు తెలిపిన ఏపీ స‌ర్కార్‌తో పాటు జ‌గ‌న్‌పైనా విమ‌ర్శ‌లు!

ఈ నెల 19న..

6వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షను నిర్వ హించనున్నారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ఈ నెల 19న మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 10 నుంచే హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. మోడల్ స్కూల్ అధికారిక వెబ్ సైట్ నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

Also read: బఫర్ జోన్‌లో అక్రమంగా గోదాం నిర్మాణం.. పట్టించుకోని అధికారులు..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×