E-Paper
Advertisement

Telangana Minister Chambers : సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌..

Telangana Minister Chambers : సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌..
Advertisement

Telangana Minister Chambers : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో మంత్రులకు సచివాలయంలోని పలు అంతస్తుల్లో ఛాంబర్లను కేటాయించింది సర్కార్‌. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సహా 11 మంది మినిస్టర్లకు ఛాంబర్లు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కు రెండో అంతస్తులోని 10, 11, 12వ నెంబర్‌ రూమ్‌లు కేటాయించారు. 4వ అంతస్తులోని 27, 28, 29 రూమ్‌లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కి కేటాయించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహకు రెండో అంతస్తులోని రూమ్‌ నెంబర్ 13, 14, 15.. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు మూడో అంతస్థు రూమ్ నెం 10, 11, 12.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెం 10,11,12.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఐదో అంతస్తులోని 27,28,29 రూమ్‌లు కేటాయించారు.

Advertisement

అలాగే దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు నాలుగో అంతస్తు రూమ్ నెం. 10, 11, 12.. పంచాయితీరాజ్ శాఖ మంత్రి దససరి అనసూయ సీతక్కకు మొదటి అంతస్తు రూమ్ 27, 28, 29.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు మూడో అంతస్తు రూమ్ నెం 27, 28, 29.. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నాలుగో అంతస్తు రూమ్ 13, 14, 15 కేటాయించారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×