E-Paper
Advertisement

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 10 జిల్లాలో మెగా జాబ్ మేళా..!

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 10 జిల్లాలో మెగా జాబ్ మేళా..!
Advertisement

Telangana Jobs: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ క్రీడలు, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా యూత్, స్పోర్ట్స్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడం, యువతలో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మే 18 నుండి 23 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడనున్నారు.మారథాన్ , ఫిజికల్ లిటరసీ, కెరీర్ , స్కిల్ డెవలప్మెంట్, యూత్ లీడర్‌షిప్ సమ్మిట్, స్పోర్ట్స్ డే, క్లీన్ తెలంగాణ కార్యక్రమం, ఉద్యోగ సాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

10 జిల్లాలలో పెద్ద మెగా జాబ్ మేళా..

అదే విధంగా రాష్ట్రంలోని 10 జిల్లాలలో పెద్ద మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆదివారం తేదీలను ప్రకటించారు. మే 1 మహబూబ్‌నగర్, 2న ఖమ్మం,4న వరంగల్, 5న కరీంనగర్,6న పెద్దపల్లి, ఆదిలాబాద్,7న నిజామాబాద్,8 మెదక్, నల్గొండ,11న రంగారెడ్డి 12న హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో తయారీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, డిజిటల్ మీడియా, ఐటీ, హెల్త్‌కేర్, బిజినెస్ సర్వీసెస్, కస్టమర్ సర్వీసెస్, లాజిస్టిక్స్ , హాస్పిటాలిటీ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ కార్యక్రమంలో 250కు పైగా కంపెనీలు పాల్గొని, సుమారు 20వేలమంది ఉద్యోగార్థులకు అవకాశాలు కల్పించనున్నాయి.ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అనిఅధికారులు వెల్లడించారు.

Advertisement

Also Read: సైబర్ నేరగాళ్లపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0 ప్రారంభం!

యాప్‌ను డౌన్‌లోడ్..

ఆసక్తి గల అభ్యర్థులు https://satg.telangana.gov.in/prajapalana⁠ లో నమోదు చేసుకోవచ్చు లేదా PrajaPalana Pragathi Pranalika: Youth & Sports మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి నమోదు చేసుకోవచ్చు అని వెల్లడించారు. నమోదు చేసిన వారికి ఇంటర్వ్యూ వివరాలు ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా పంపనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్స్ శాఖ, ఇండస్ట్రీస్ , కామర్స్ శాఖల సహకారంతో నిర్వహించబడుతోంది. టాస్క్, డీట్ ద్దతుతో, సాప్ట్ పాత్ టెక్నాలజీ, వల్లేరోసాంకేతిక భాగస్వాములుగా ఉన్నారు.తెలంగాణ ప్రభుత్వం యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని అధికారులు వెల్లడించారు.

Advertisement

Also read: గుండ్లపోచంపల్లిలో విష విలయం.. వేల సంఖ్యలో చేపలు మృతి.. పట్టించుకోని అధికారులు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×