E-Paper
Advertisement

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్.. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్.. అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి
Advertisement
telangana youth died in america with brain stroke
telangana youth died in america with brain stroke

Telangana Youth Died in US(TS news updates): విదేశాల్లో ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగం సాధించాలని అతను కన్న కలలన్నీ ఆవిరయ్యాయి. తల్లిదండ్రులు కొడుకును ఉన్నత శిఖరాలపై చూడాలనుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. వారి కలలు తీరకుండానే బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో మృత్యువు కబళించింది. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీఓ తులసీరాజన్ పెద్దకొడుకు బండా రుత్విక్ రాజన్ (30) రెండేళ్ల క్రితం ఉన్నత చదువులకై అమెరికా వెళ్లాడు.

Read More : ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి..

Advertisement

అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఇటీవలే ఎంఎస్ పూర్తిచేసి పట్టా పొందాడు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న అతను.. స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి కిందపడ్డాడు. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోయాడని తెలిపారు. కుమారుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి రుత్విక్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. కొడుకును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×