E-Paper
Advertisement

Telangana Civil Supplies: ఎల్పీజీ పంపిణీపై నిరంతర నిఘా.. రంగంలోకి పౌర సరఫరాల శాఖ ప్రత్యేక విభాగం

Telangana Civil Supplies: ఎల్పీజీ పంపిణీపై నిరంతర నిఘా.. రంగంలోకి పౌర సరఫరాల శాఖ ప్రత్యేక విభాగం
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ముడి చమురు కొరత అలాగే గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న ఆటంకాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వంటగ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించడానికి ఒక అత్యాధునిక మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నేడు అందుబాటులోకి తెచ్చింది. ఈ కేంద్రం రోజుకు 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తూ ఎల్పీజీ రవాణా కు సంబంధించి పర్యవేక్షిస్తుంది. గృహ వినియోగదారులకు ప్రాధాన్యత కలిగిన వాణిజ్య రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా గ్యాస్ అందేలా చూడటమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం.

ఈ ప్రతిష్టాత్మక విభాగానికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన తన బృందంతో కలిసి ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో స్టాక్ లభ్యతను తనిఖీ చేస్తారు. జిల్లా అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ రవాణాలో తలెత్తే అడ్డంకులను వెంటనే తొలగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ వాహనాల జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రభుత్వానికి అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

ఈ కమాండ్ సెంటర్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే కాకుండా ఆయిల్ కంపెనీల ప్రతినిధులు కూడా అందుబాటులో ఉంటారు. పోలీసు అధికారులు, పరిశ్రమల విభాగం ప్రతినిధులు అలాగే డిస్ట్రిబ్యూటర్ల సంఘం సభ్యులు షిఫ్టుల వారీగా ఇక్కడ విధులు నిర్వహిస్తారు. ఏదైనా ప్రాంతంలో గ్యాస్ కొరత ఏర్పడినా లేదంటే రవాణాలో జాప్యం జరిగినా తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు ఈ ఉమ్మడి వేదిక దోహదపడుతుంది. ప్రజల ఫిర్యాదుల స్వీకరణ కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967 ను కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

రవాణా వాహనాలు దారి మళ్లకుండా చూడటం ద్వారా నల్లబజారును అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. జిల్లాల వారీగా ఉన్న నిల్వ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ స్థానిక అవసరాలకు తగినట్లుగా సరఫరాను క్రమబద్ధీకరిస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందుతాయి. సాంకేతికతను వినియోగించుకుంటూ పౌర సరఫరాల శాఖ చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం రాష్ట్రంలో ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయనుంది.

Advertisement

ALSO READ: Induction Stove Sales: గ్యాస్ కొరత ఎఫెక్ట్.. రికార్డ్ స్థాయిలో ఇండక్షన్ స్టవ్ సేల్స్.. 24 గంటల్లో ఎంతంటే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×