// // Telangana IPS transfers: తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్‌? -->
E-Paper
Advertisement

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్‌?

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్‌?
Advertisement

Telangana IPS transfers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేపడుతూ పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం జీవో జారీ చేశారు. ఈ బదిలీలు మే 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. హోం శాఖ, విజిలెన్స్, కీలక పోలీస్ కమిషనరేట్లలో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆమె విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పనిచేస్తున్నారు. హోం శాఖ బాధ్యతలతో పాటు ఆమె తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను కొనసాగిస్తారు. ఇక దేవేంద్ర సింగ్ చౌహాన్ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కొత్త డైరెక్టర్ జనరల్‌గా, సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’కి మొదటి పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ తరుణ్ జోషిని నియమించింది. ప్రస్తుతం ఆయన ఏసీబీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న అవినాష్ మొహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయనకు ఏసీబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. అటు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న బి. సుమతిని మల్కాజిగిరి కొత్త పోలీస్ కమిషనర్‌గా నియమించారు.

డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఉన్న షాహ్నవాజ్ ఖాసింను మల్టీ జోన్-II ఐజీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనకు ఐజీపీ (పర్సనల్) అదనపు బాధ్యతలు కూడా కేటాయించారు. అలాగే, ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న కార్తికేయకు ఎస్ఐబీ (SIB) ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పాలనలో వేగం పెంచేందుకు శాంతిభద్రతల పరిరక్షణలో అనుభవం ఉన్న అధికారులకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఈ భారీ బదిలీలను చేపట్టింది.

Advertisement

తెలంగాణ తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్‌ నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, మే మొదటి వారంలో ఆనంద్‌ బాధ్యతలు చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం ఆయన హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండగా, తాజా బదిలీల్లో ఆ స్థానంలో శిఖా గోయల్‌ను నియమించారు. దీనితో సీవీ ఆనంద్‌కు పోలీస్ బాస్‌గా పగ్గాలు అప్పగించడం దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది.

Read Also: 15 ఏళ్ల నాటి కేసులో.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×