E-Paper
Advertisement

Telangana Inter results-2026: తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదల, ఈసారి బాలికలే టాప్

Telangana Inter results-2026: తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదల, ఈసారి బాలికలే టాప్
Advertisement

Telangana Inter results-2026:  తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్- సెకండియర్ ఫలితాలను బోర్డు విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్ ఉత్తీర్ణత 66.20 మంది ఉత్తీర్ణత కాగా, ఇంటర్ సెకండియర్‌లో 70.58 మంది ఉత్తీర్ణత సాధించారు.  ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల పైచిలుకు విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు వెబ్‌సైట్ లేకుంటే వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను పొందొచ్చు.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Advertisement

తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి.  ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ బోర్డు వాటిని విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి సుమారు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యా శాఖ సెక్రటరీ, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్‌పర్సన్, IAS యోగిత రాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ ఉత్తీర్ణత 66.20 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలురు ఉత్తీర్ణత 57.69 శాతం కాగా, బాలికలు 74.40 శాతం సాధించారు. మొత్తం 4,89, 123 మందికి గాను, దాదాపు 3, 23, 807 మంది పాసయ్యారు.

Advertisement

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఇంటర్ సెకండియర్‌లో  3,58, 490 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  70.58 శాతం మంది పాసయ్యారు.  అందులో బాలిక శాతం 78.65 కాగా, బాలురులు 62.50 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాలను ఎలా తెలుసుకోవాలి? ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ tgbie.cgg.gov.in లేకుంటే results.cgg.gov.in ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే TS Inter Results 2026 లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. చివరకు సబ్‌మిట్ బటన్ నొక్కితే మార్కులు వస్తాయి. అందులో పాస్/ఫెయిల్ అనేది ఉంటుంది. మార్కుల షీట్‌ను విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలి.

కేవలం వెబ్ సైట్ ద్వారానే కాదు.. ఈసారి వాట్సాప్ ద్వారా కూడా రిజల్స్ట్ తెలుసుకునే ఏర్పాట్లు చేసింది ఇంటర్ బోర్డు. 8096958096 నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ మెసేజ్ పంపాలి. అక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపించగానే ఇంటర్ ఫలితాల మీద క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. డౌన్‌లోడ్ ఆప్షన్‌ను క్లిక్ చేసి మార్క్స్‌షీట్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

ALSO READ: శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మంటలకు ఆహుతైన అలంకరణ వస్తువులు

మే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని బోర్డు ఆలోచన చేస్తోంది. ఈ పరీక్షల్లో ఫెయిలైన వారు మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చు. ఆ నెల చివరిలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ప్రకటించాలని ఆలోచన చేస్తోంది ఇంటర్ బోర్డు.

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెల్లడికానుండడంతో ఏపీలో ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 18 లేదా 19న ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఇంటర్మీడియట్ బోర్డు. ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేశారు.

ఫలితాలకు సంబంధించిన డేటా ప్రాసెసింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 16 నాటికి ఆ ప్రక్రియ పూర్తి కావచ్చని చెబుతున్నారు. మొత్తానికి ఏప్రిల్ థర్డ్ వీక్ లోపు ఫలితాలను విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×