E-Paper
Advertisement

High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్.. ఒక్కసారిగా బెట్టింగ్ యాప్ ప్రత్యక్షం

High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్.. ఒక్కసారిగా బెట్టింగ్ యాప్ ప్రత్యక్షం
Advertisement

High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరిగాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించిన పలువురు.. అదే సమయంలో ఒక అనుమానాస్పద బెట్టింగ్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవ్వడం గమనించారు. ఈ ఘటనను హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.

సాధారణంగా న్యాయవాదులు, పిటిషనర్లు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు, ఇతరులు ప్రతిరోజూ వేల సంఖ్యలో హైకోర్టు వెబ్‌సైట్‌లోని ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేస్తుంటారు. అయితే గత రెండు రోజులుగా PDF పై క్లిక్ చేయగానే అసలు ఫైల్ మిస్సై, BDG SLOT అనే అనుమానాస్పద ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫాం తెరుచుకుంటోందని.. వినియోగదారులు గమనించారు.

Advertisement

ఈ అంశాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ టెక్నికల్ సెక్షన్ ముందుగా పరిశీలించి హ్యాకింగ్ జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్ సైబర్ క్రైం పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైకోర్టు వెబ్‌సైట్‌లోని PDF జనరేట్ సర్వర్లను, రీడైరెక్ట్ స్క్రిప్టులను, కంటెంట్ మేనేజ్‌మెంట్ లాగ్ ఫైళ్లను ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు.

Advertisement

హైకోర్టు వెబ్‌సైట్ రోజుకు 1–2 లక్షల పేజీ వ్యూస్‌ను అందుకుంటుంది. లిటిగెంట్లు తమ కేసులపై తాజా అప్‌డేట్లు తెలుసుకోవడానికి ఎక్కువగా ఆధారపడే వెబ్‌సైట్ ఇదే. ఇలాంటి కీలక ప్లాట్‌ఫారమ్ హ్యాక్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read: జూబ్లీహిల్స్ విజయం.. కాంగ్రెస్ వెంటే TDP ఓటర్లు!

దాడి అనంతరం హైకోర్టు ఐటీ విభాగం వెబ్‌సైట్‌లో కొన్ని భాగాలను తాత్కాలికంగా రీస్ట్రిక్ట్ చేసినట్లు తెలుస్తోంది. PDF డౌన్‌లోడ్ లింక్స్‌ను పునర్విమర్శించి, క్లీన్ ఫైళ్లను అప్‌లోడ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×