E-Paper
Advertisement

‘ముందు బాధితురాలి వయసు తేల్చండి’.. బండి భగీరథ్ కేసులో హైకోర్టు సంచలనం

‘ముందు బాధితురాలి వయసు తేల్చండి’.. బండి భగీరథ్ కేసులో హైకోర్టు సంచలనం
Advertisement

Bandi Bhagirath Case: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాలిక మైనరా? కాదా? అన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో.. దానిపై రీ-వెరిఫికేషన్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం మధ్యంతర బెయిల్ పై తీర్పును రేపు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

మైనర్ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ను ఏ క్షణమైనా సిట్ అధికారులు అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బండి భగరీథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టగా.. భగీరథ్ తరపున ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. బాధితురాలి వయసు విషయంలో స్పష్టత లేదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

బాధితురాలికి సంబంధించిన ఒక్కో సర్టిఫికేట్ లో ఒక్కో రకమైన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లు నిరంజన్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ బాధితురాలి వయసుపై తిరిగి రీ-వెరిఫికేషన్ చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Also Read: UP Rains: విరుచుకుపడ్డ వర్షాలు.. ఏకంగా 100 మంది మృత్యువాత.. సీఎం తీవ్ర భావోద్వేగం

Advertisement

వాస్తవానికి బుధవారమే (మే 13వ తేదీ) బండి భగీరథ్ సిట్ అధికారుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. 2 గంటల వరకూ డెడ్ లైన్ విధించినప్పటికీ భగీరథ్ వెళ్లలేదు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకోవడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులకు భగీరథ్ ఓ లేఖ పంపారు. శుక్రవారం (మే 15) వస్తానని దర్యాప్తు అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలోనే మధ్యంతర బెయిల్ కోసం భగీరథ్ హైకోర్టును ఆశ్రయించడం కోర్టు కూడా తీర్పును రేపటికి వాయిదా వేయడంతో.. ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి మెుదలైంది.

Also Read: ఓటర్లకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో SIR.. ఆ తేదీల్లో ఇంటింటి సర్వే

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×