// // Hyderabad News: పంచాయతీ ఎన్నికలు, స్టే విధించలేం-హైకోర్టు -->
E-Paper
Advertisement

Hyderabad News: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. స్టే విధించలేమన్న హైకోర్టు

Hyderabad News: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. స్టే విధించలేమన్న హైకోర్టు
Advertisement

Hyderabad News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవో నెంబరు 46పై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని తేల్చి చెప్పింది ధర్మాసనం. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలను రద్దు చేయాలని కోరుకుంటున్నారా అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది.

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు

Advertisement

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇదే సమయంలో రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబరు 46పై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని, ఏబీసీడీ కేటగిరిగా విభజించి అములు చేయాలని పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఉన్న దశలో ఎన్నికల పై స్టే విధించలేమని తేల్చేసింది హైకోర్టు.

సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు ఎన్నికలు రద్దు చేయాలని మీరు కోరుకుంటున్నారా? అంటూ పిటిషన్‌ను ప్రశ్నించింది. 42 శాతం రిజర్వేషన్ GO విచారణ సమయంలో పాత పద్ధతి లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పినట్టు గుర్తు చేసింది.

Advertisement

ఎన్నికలకు  స్టే విధించలేమన్న తేల్చిన హైకోర్టు

ఈ సమయంలో పిటిషన్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుని, 2009 లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్‌ను రద్దు చేసినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈలోగా ఈసీ తరపు న్యాయవాది జోక్యం చేసుకున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని అన్నారు.

ఇలాంటి దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని మరోసారి స్పష్టం చేసింది కోర్టు. ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించామని, ఎలా స్టే ఎలా ఇస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. ఇదే క్రమంలో డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు కాపీ ఇవ్వాలని కోరారు పిటిషనర్ న్యాయవాది. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది న్యాయస్థానం.

ALSO READ: సర్పంచ్ ఎన్నికల వేళ..  పదవి కోసం లక్షల్లో వేలం పాటలు

సబ్ కేటగిరి రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దీనిపై ఆరు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×