E-Paper
Advertisement

HC on Group 1 Petitions: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలకు బ్రేక్? హైకోర్టు తీర్పు వాయిదాతో అభ్యర్థుల్లో మొదలైన గుబులు!

HC on Group 1 Petitions: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలకు బ్రేక్? హైకోర్టు తీర్పు వాయిదాతో అభ్యర్థుల్లో మొదలైన గుబులు!
Advertisement

HC on Group 1 Petitions: తెలంగాణలో గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత రద్దయి, తిరిగి 2024లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలకు సంబంధించిన తుది తీర్పును రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది.

గత విచారణ సందర్భంలోనే చీఫ్ జస్టిస్ (CJ) నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును నేటికి వాయిదా వేసింది. అయితే సాంకేతిక కారణాల వల్ల తీర్పు కాపీలు పూర్తిస్థాయిలో రూపకల్పన జరగలేదు. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి విచారణను, తుది నిర్ణయాన్ని వచ్చే నెల ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 5న గ్రూప్-1 భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

ఈ వివాదంలో ప్రధానంగా 2024లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల ఫలితాలు, రిజర్వేషన్లు, ఇతర నిబంధనలపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అయితే, TGPSC నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇప్పటికే ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం నియామక పత్రాలు (Posting Orders) అందజేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో చేరిన వారి పరిస్థితి ఈ తుది తీర్పుపైనే ఆధారపడి ఉండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

గతంలో ఈ కేసును విచారించిన సింగిల్ బెంచ్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయగా, దానిని సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఆ సమయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుండి ఈ కేసుపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పు అటు ఉద్యోగాల్లో చేరిన వారికి, ఇటు పిటిషన్ వేసిన అభ్యర్థులకు అత్యంత కీలకం కానుంది.

Advertisement

Also Read: లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి.. ఏం జరగబోతోంది?

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లోని సంస్కరణలు, పరీక్షల నిర్వహణ తీరుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 5వ తేదీన హైకోర్టు ఇచ్చే తుది తీర్పుతో ఈ వివాదానికి ముగింపు పడుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×