E-Paper
Advertisement

హై అలర్ట్.. తెలంగాణలో నేటి నుంచి మళ్లీ భారీ వర్షాలు.. ఆ 10 జిల్లాల ప్రజలు జాగ్రత్త!

హై అలర్ట్.. తెలంగాణలో నేటి నుంచి మళ్లీ భారీ వర్షాలు.. ఆ 10 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
Advertisement

Telangana Weather: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు.. గత వారం రోజులుగా నాన్‌స్టాప్‌గా దంచికొట్టిన వానలు.. నిన్న కాస్త విరామం ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. వరద తాకిడి నుంచి తేరుకుంటున్న సమయంలోనే, వాతావరణ శాఖ మళ్లీ ఒక బిగ్ అప్‌డేట్ అందించింది. వానలు తగ్గడం తాత్కాలికమేనని, నేటి మధ్యాహ్నం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్ష మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఈ జిల్లాల్లో నేడు వర్ష సూచన
వాతావరణ నిపుణుల తాజా అంచనాల ప్రకారం.. నేటి మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉంది. వీటితో పాటు నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయని హెచ్చరించారు.

Advertisement

రేపటి నుంచి భారీ వర్షాల హెచ్చరిక
నేడు కురిసే వానలు కేవలం ఆరంభం మాత్రమేనని, అసలు సీన్ రేపటి నుంచి మొదలుకానుందని వాతావరణ శాఖ సంకేతాలు ఇచ్చింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో శనివారం, ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్ష తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

నెలాఖరు వరకు నాన్‌స్టాప్ వానలు!
ఈ వానలు సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తున్నాయి. ఈ జులై నెలాఖరు వరకు రాష్ట్రంలో వర్షాల హోరు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిరంతరాయంగా కురిసే వానల వల్ల ఇప్పటికే చెరువులు, వాగులు నిండి పొంగిపొర్లుతుండగా.. కొత్తగా రాబోయే వర్షాలు దిగువ ప్రాంతాల ప్రజలకు, అలాగే రైతులకు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ముఖ్యంగా పత్తి, మిరప వంటి పంటల్లో నీరు చేరకుండా రైతులు తగిన మురుగునీటి వసతి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

Advertisement

ప్రజలు, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాతావరణం వేగంగా మారుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపైకి వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఆగవద్దని అధికారులు కోరుతున్నారు. అత్యవసర సహాయం కోసం స్థానిక యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు స్థానిక వాతావరణ సమాచారాన్ని గమనిస్తూ సురక్షితంగా ఉండటం శ్రేయస్కరం.

Also Read: CJP ఆందోళనలు.. 17 మెట్రో స్టేషన్లు బంద్, స్తంభించిన ప్రయాణాలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×