E-Paper
Advertisement

గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో వర్షాలు, పలు జిల్లాల్లోనూ వానలు

గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో వర్షాలు, పలు జిల్లాల్లోనూ వానలు
Advertisement

Rain Alert: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో అప్పుడే ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను మేఘాలు కమ్ముకున్నాయి. రాబోయే రెండు గంటల్లో నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మహేశ్వరం, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలతో పాటు సంగారెడ్డి (జహీరాబాద్), మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

మరోవైపు కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ చెల్లాచెదురుగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గ్రామీణ తెలంగాణలోని యాదాద్రి భువనగిరి (బీబీనగర్), రంగారెడ్డి, నల్గొండ (మిర్యాలగూడ), ఖమ్మం, జనగామ, సిద్దిపేట (హుస్నాబాద్), సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా రాగల రెండు గంటల పాటు ఈ వాతావరణమే కొనసాగనుంది.

Advertisement

హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్

ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఖైరతాబాద్, తోలిచౌకి, కార్వాన్, లంగర్ హౌస్, అమీర్‌పేట్ పరిసరాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఇది మరో 20 నుండి 30 నిమిషాల పాటు కొనసాగి, ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పడుతుంది. అయితే, రాబోయే ఒక గంటలో దక్షిణ హైదరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, బాలాపూర్, శంషాబాద్ వైపు అక్కడక్కడ తుఫాను గాలులతో కూడిన వర్షం పడవచ్చు. ఆ తర్వాత కూడా సౌత్ హైదరాబాద్‌లో వర్షం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్లేవారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం మంచిదంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Also Read: మనుషుల ఎముకలతో కట్టిన చర్చి.. లోపలి దృశ్యాలు చూస్తే వణికిపోవాల్సిందే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×