E-Paper
Advertisement

TIMS Hospital: టిమ్స్‌లో రిక్రూట్ మెంట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

TIMS Hospital: టిమ్స్‌లో రిక్రూట్ మెంట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?
Advertisement

TIMS Hospital: టిమ్స్ దవాఖాన్ల రిక్రూట్ మెంట్ పై ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నది. రిక్రూట్ మెంట్ ఏ తరహాలో ఉండాలనే దానిపై స్టడీ చేస్తున్నది. నిమ్స్ తరహాలో నియామకాలు చేయాలా? మరే ఇతర కొత్త పాలసీలు తీసుకురావాలా? అనే అంశంపై వైద్యారోగ్యశాఖ పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నది. నిమ్స్ ఆసుపత్రి పూర్తిగా అటానమస్ గా పనిచేస్తుంది. దీంతో ఆ సంస్థ సొంతంగానే నియామకాలు పూర్తి చేసుకుంటుంది. బదిలీలు వంటివేవీ ఉండవు. ఒక సారి రిక్రూటైన తర్వాత రిటర్మెంట్ వరకు నిమ్స్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పాలసీని టిమ్స్ కు వర్తింప చేస్తే ఎలా ఉంటుందనే దానిపై సర్కార్ అభిప్రాయాలు సేకరిస్తున్నది. త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

Also Read: HPV Vaccination: టీకా వేయాలంటే.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

కొత్త పోస్టులపై స్పీడప్..

Advertisement

నగరంలో అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా, అక్కడ పనిచేసే సిబ్బంది నియామకంపై ఇప్పుడు రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు 4,500 పోస్టుల భర్తీకి సంబంధించి కీలకమైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.నగరంలో సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్ టిమ్స్ ఆసుపత్రులకు కలిపి దాదాపు 4,500 పోస్టుల అవసరముందని అధికారులు గుర్తించారు. స్పెషలిస్టు డాక్టర్లు, అసిస్టెంట్ ప్రోఫెసర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, పారామెడికల్, టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టాఫ్​.. ఇలా దాదాపు నాలుగువేలకు పైనే స్టాఫ్​ అవసరమని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. దీనికి త్వరలోనే ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వనున్నది.

Also Read: Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో ఆ పదిమంది ఓటు ఎటు..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×