E-Paper
Advertisement

TG Govt: పంచాయతీలకు సంక్రాంతి కానుక.. రూ.277 కోట్లు విడుదల

TG Govt: పంచాయతీలకు సంక్రాంతి కానుక.. రూ.277 కోట్లు విడుదల
Advertisement

TG Govt: తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సంక్రాంతి కానుక ప్రకటించింది. గ్రామాల అభివృద్ధి, ఇతర పనులకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో.. ఆర్థికశాఖ నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా విడుదలైన విధులతో గ్రామాల్లో పెండింగ్‌ పనులు పూర్తి కావడమే కాకుండా, పంచాయతీల నిర్వహణ ఊతం లభించనుంది. నిధుల విడుదలపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల అభివృద్ధికి నిధులు

రాష్ట్రంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మెజారిటీ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ సాధించారు. కొత్త సర్పంచ్ లు నిధుల కొరతతో ఇబ్బందులు పడకుండా, గ్రామ స్థాయి అభివృద్ధి పనులు ఆగిపోకుండా ప్రభుత్వం నిధులను సమకూర్చింది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాలు, గ్రామీణ మౌలిక సదుపాయాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. పండుగ వేళ నిధుల విడుదలతో గ్రామ స్థాయి ప్రతినిధుల్లో ఉత్సాహాన్ని నింపింది.

కొత్త పాలక వర్గాలకు ఊతం

Advertisement

ఇటీవల ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు బాధ్యతలు చేపట్టిన వెంటనే నిధులు రావడంతో గ్రామ పాలన సుగమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక అవసరాలకు, గ్రామాభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా ఈ నిధులు వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే మౌలిక సదుపాయలకు ఈ నిధులు ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నిధుల విడుదలు, ఖర్చులు, పర్యవేక్షణ వ్యవస్థపై ఈ భేటీలో చర్చించారు.

Advertisement

Also Read:  ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుక మామూలుగా లేదుగా..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×