E-Paper
Advertisement

Telangana Govt: ఎంసీహెచ్ కిట్ మళ్లీ ప్రారంభం? ప్రభుత్వంలో జోరుగా చర్చలు

Telangana Govt: ఎంసీహెచ్ కిట్ మళ్లీ ప్రారంభం? ప్రభుత్వంలో జోరుగా చర్చలు
Advertisement

Telangana Govt: స్వేచ్ఛ, బ్యూరో: గతంలో పబ్లిక్ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిన ఎంసీహెచ్ కిట్ స్కీమ్ ను మళ్లీ తిరిగి ప్రారంభించాలనే ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ స్కీమ్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశంపై ఆఫీసర్లు కూడా తాజాగా ఆర్ధిక శాఖ మీటింగ్ లో వివరించారు. ఈ స్కీమ్ ఎఫెక్టీవ్ అంటూ వివరించారు. పేరు మార్చినా..కొనసాగిస్తే ప్రభుత్వానికి మంచి మైలేజ్ వస్తుందని ఆఫీసర్లు ఆ మీటింగ్ లో రిపోర్టులతో సహా వెల్లడించారు. పాజిటివ్ గా స్పందించిన డిప్యూటీ సీఎం…ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతుందని చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ కిట్ వలన ప్రజలకు మేలు జరిగే విధంగా ఉన్నందున..పు:న ప్రారంభిస్తారనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ స్కీమ్ పంపిణీపై పూర్తి స్థాయిలో స్టడీ చేసిన వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతేగాక ఈ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తే, ఈ ఆర్ధిక సంవత్సరం నుంచే ఈ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉన్నదని ఓ అధికారి తెలిపారు.

Also Read: Romantic Movie OTT: స్పృహ లేని అమ్మాయితో రచ్చ చేసే రాక్ స్టార్ … పెళ్లి అంటూ రాత్రికి  రాత్రే పాడుపని

వైద్యారోగ్యశాఖలో రికార్డు

Advertisement

వైద్యారోగ్య రంగంలో ఒక మైలురాయిగా కేసీఆర్ కిట్ నిలిచింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కిట్ కు ఎంసీహెచ్ కిట్ గా పేరు పెట్టారు. కానీ పంపిణీని మాత్రం నిలిపివేశారు. తల్లి, బిడ్డ ఆరోగ్యమే లక్ష్యంగా 2017 జూన్ 2న ఈ పథకాన్ని ప్రారంభించిన ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు, రిక్వెస్టులు వచ్చాయి. దీంతో మళ్లీ తిరిగి ప్రారంభించాలనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16.50 లక్షల మందికి ఈ కిట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కిట్ల పంపిణీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెరిగాయి. ఈ కిట్ల పంపిణీ కంటే ముందు ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు సంఖ్య 30 శాతం ఉండగా, ఆ తర్వాత 70 శాతానికి పెరిగాయి. తద్వారా ఇనిస్టిట్యూషన్ డెలివరీలు పెరగడంతో పాటు శిశు మరణాల రేటు ,మాతృ మరణాల రేటు లు తగ్గాయి. 2014 కంటే ముందు సగటున మాత రణాలు రేట్ 92 ఉండగా, కిట్ల పంపిణీ స్కీమ్ ప్రారంభం తర్వాత 43కి తగ్గినట్లు వైద్యారోగ్యశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక శిశు మరణాల రేట్ 21కి తగ్గింది.

Also Read:Horror Movie OTT : ప్రాణ స్నేహితురాలి కోసం ప్రాణాల మీదికి… దెయ్యం రాకతో ఊహించని ఉత్కంఠ 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×