E-Paper
Advertisement

MANUU Land Issue: మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీ భూములపై దుష్ప్రచారం.. ఖండించిన తెలంగాణ ప్రభుత్వం

MANUU Land Issue: మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీ భూములపై దుష్ప్రచారం.. ఖండించిన తెలంగాణ ప్రభుత్వం
Advertisement

MANUU Land Issue: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU)కి గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకుంటోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని స్పష్టం చేసింది. గచ్చిబౌలిలోని ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకోనుందంటూ ‘తెలుగు స్క్రైబ్’ అనే ఎక్స్ ఖాతాలో వచ్చిన పోస్ట్‌పై ప్రభుత్వం అధికారికంగా స్పందించింది.

“హెచ్‌సీయూ (HCU) భూముల ప్లాన్ ఫెయిల్ అయ్యింది.. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములు గుంజుకుందాం.” అనే శీర్షికతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించగా, అందులో నిరుపయోగంగా ఉన్న 50 ఎకరాలను జప్తు చేయడానికి రంగం సిద్ధమైందని, దీనికి సంబంధించి రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు ఇచ్చారంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లో, విద్యార్థుల్లో ఆందోళన నెలకొనడంతో ప్రభుత్వం ‘ఫ్యాక్ట్ చెక్’ ద్వారా వివరణ ఇచ్చింది.

Advertisement

ఈ వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి స్పష్టత ఇచ్చారు. జిల్లాలో ప్రభుత్వ భూములు పొందిన వివిధ సంస్థలు, కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం అనేది ప్రతి ఏటా జరిగే సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని ఆయన తెలిపారు. 2024 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారి, తహశీల్దార్ ఆధ్వర్యంలో ఒక ఆడిట్ కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ ప్రభుత్వ భూముల వినియోగాన్ని పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.

ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక సంస్థలకు భూములను కేటాయిస్తుంది. అయితే, ఆయా సంస్థలు ఆ భూమిని ఏ విధంగా వినియోగిస్తున్నాయో తెలుసుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఇందులో భాగంగానే, ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన 200 ఎకరాల్లో 150 ఎకరాలు వినియోగంలో ఉండగా, మిగిలిన 50 ఎకరాలు ఎందుకు ఖాళీగా ఉందో వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. అంతేకానీ, భూమిని వెనక్కి తీసుకోవడానికి కాదని స్పష్టం చేశారు. ఆయా సంస్థలు ఇచ్చే వివరణను జిల్లా కమిటీ పరిశీలిస్తుందన్నారు.

Advertisement

ప్రస్తుతం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను వెనక్కి తీసుకునే ఆలోచన గానీ, ప్రణాళిక గానీ ప్రభుత్వానికి లేదని అధికారులు తేల్చిచెప్పారు. దురుద్దేశపూర్వకంగా చేసే ఇటువంటి తప్పుడు ప్రచారాలను, పుకార్లను ప్రజలు నమ్మవద్దని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Read Also: ఉగాదికి వస్తున్నాం.. పార్టీపై కవిత కీలక ప్రకటన

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×