E-Paper
Advertisement

Telangana Fact Check: సీఎం రేవంత్ విదేశీ పర్యటనపై పిచ్చిరాతలు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఫ్యాక్ట్ చెక్ టీమ్!

Telangana Fact Check: సీఎం రేవంత్ విదేశీ పర్యటనపై పిచ్చిరాతలు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఫ్యాక్ట్ చెక్ టీమ్!
Advertisement

Telangana Fact Check: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. దావోస్ (Davos Visit), అమెరికా పర్యటన (US Tour)లపై దుష్ప్రచారం జోరుగా సాగిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ కంటే ముందే ఆయన దావోస్ నుంచి న్యూయార్క్ వెళ్లి పోయారాని.. హార్వర్డ్ క్లాసులు పేరు చెప్పి స్నేహితులతో ప్రైవేటు హోటల్లో బస చేశారని బీఆర్ఎస్ (BRS) అనుకూల వర్గాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అయితే ఆ ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt) సంబంధించిన అధికారిక ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది. ఆ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎక్స్ వేదికగా తప్పుడు వార్తలకు చెక్ పెట్టింది.

అసలు నిజాలు ఇవే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి విదేశీ పర్యటనపై కొందరు ఉద్దేశపూర్వంగా తప్పుడు ప్రచారం చేశారని ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఎక్స్ వేదికగా పేర్కొంది. దీనిని ప్రజలను తప్పుదారి పట్టించడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణించింది. సీఎం రేవంత్ దావోస్ పర్యటన ముందస్తు షెడ్యూల్ ప్రకారమే సాగిందని ఫ్యాక్ట్ చెక్ టీమ్ నిర్ధారించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారని పేర్కొంది. దావోస్ లో అధికారికంగా హాజరుకావాల్సిన కార్యక్రమాలు అన్ని ముగిసిన తర్వాతే సీఎం రేవంత్ అమెరికాకు పయనమయ్యారని స్పష్టం చేసింది.

Advertisement

అంతా షెడ్యూల్ ప్రకారమే.. 

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన, హార్వర్డ్ కార్యక్రమం ముందస్తు షెడ్యూల్ ప్రకారమే జరిగిందని ఫ్యాక్ట్ చెక్ టీమ్ ధ్రువీకరించింది. షెడ్యూల్ ప్రకారమే సీఎం రేవంత్ అమెరికాకు వెళ్లి.. అక్కడి హార్వర్డ్ యూనివర్శిటీలో విద్యకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే తరగతులు జరిగాయని అక్కడ కోర్సు పూర్తయిన తర్వాత ఆ ప్రోగ్రాంకి సంబంధించిన సర్టిఫికెట్‌ను కూడా యూనివర్సిటీ అధ్యాపకులు ముఖ్యమంత్రికి అందించారని ఫ్యాక్ట్ చెక్ టీమ్ వెల్లడించింది. సీఎం రేవంత్.. దావోస్, అమెరికా పర్యటనలు.. ముందుగా షెడ్యూల్ చేసిన ప్రోటోకాల్ ప్రకారమే నిర్వహించబడ్డాయని, ఇందులో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పింది. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న ఉద్దేశంతోనే ఎక్స్ వేదికగా ఈ వివరణ ఇస్తున్నట్లు ఫ్యాక్ట్ చెక్ టీమ్ చెప్పుకొచ్చింది.

Advertisement

Also Read: Mahabubabad Municipal: కొత్తగూడెం నగరపాలక సంస్థలు రసవత్తరంగా రాజకీయం.. ఆ 10 సీట్ల కోసం సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు కుస్తీ!

సీఎంపై వచ్చిన దుష్ప్రచారాలు ఏంటీ?

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో 2 రోజులు కనిపించకుండా పోయారంటూ కొందరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనిని అవినీతి, కమీషన్లకు ముడిపెడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ప్రచారాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించినప్పటికీ వాటికి బ్రేక్ పడలేదు. అటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వెనుక సైతం ఏదో మర్మం ఉందన్న రేంజ్ లో బీఆర్ఎస్ అనుకూల వర్గాలు ప్రచారాన్ని నిర్వహించాయి. తాజాగా ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఇచ్చిన వివరణతో.. ప్రజలకు అసలు వాస్తవాలు ఏంటో తెలిశాయని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.

Also Read: Pawan Kalyan Warns: ఏపీలో అధిక మద్యం ధరలు.. చెడ్డపేరు తేవద్దంటూ.. పవన్ కళ్యాణ్ సీరియస్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×