E-Paper
Advertisement

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో రూ.2 వేల కోట్లు రిలీజ్.. ఆర్థికశాఖ ఉత్తర్వులు

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో రూ.2 వేల కోట్లు రిలీజ్.. ఆర్థికశాఖ ఉత్తర్వులు
Advertisement

Employee Dues: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆదేశాల మేరకు.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం రూ 2 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నెల 29న మొదటి విడతగా రూ. 2వేల కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం.. సోమవారం రెండో విడతలో మరో రూ. 2 వేల కోట్ల నిధులను విడుదల చేసి తన నిబద్ధతను నిరూపించుకుంది.

Advertisement

అయితే పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను వంద శాతం చెల్లించి, వారి ఖాతాలను పూర్తిగా క్లియర్ చేసింది. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్​ ఖాతాల్లో ఎలాంటి పెండింగ్‌లు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది.

Also Read: ‘హరీశ్ రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది’.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు!

Advertisement

పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల లోపు విలువ కలిగిన చిన్న మొత్తాల బిల్లులన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించింది. ఈ విభాగంలో దాదాపు 5 లక్షలకు పైగా ఉన్న టోకెన్లను గుర్తించి ఏమాత్రం జాప్యం లేకుండా చెల్లింపులు జరిపారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపుతున్న సానుకూల ధోరణి అభినందనీయమని వారు కొనియాడుతున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన బకాయిలను కూడా క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించడంతో ఉద్యోగుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.

Also Read: ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే.. ప్రాణాలకే ప్రమాదం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×