E-Paper
Advertisement

దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. అప్పు మాఫీ.. 10లక్షల కొత్త స్కీమ్!

దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. అప్పు మాఫీ.. 10లక్షల కొత్త స్కీమ్!
Advertisement

Disabled Welfare: స్వేచ్ఛ బ్యూరో: దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి, బ్యాంకులతో అనుసంధానం చేస్తోంది. స్వయం సంవృద్ధి సాధించేందుకు కృషిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగ గ్రూపుల్లో సభ్యులై ఉండి మృతి చెందితే 10లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు తీసుకున్న రుణాన్ని సైతం మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

నల్గొండ జిల్లాలో..

రాష్ట్రంలోని దివ్యాంగుల ఆర్థికాభివృద్ధితోపాటు వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేస్తుంది. ఆ సంఘాలను బ్యాంకులతో అనుసంధానం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 12,930 దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేశారు. సుమారు 80 వేల మంది దివ్యాంగులు ఈ సంఘాల్లో సభ్యులుగా చేరారు. ప్రతి నెల పొదుపు చేసుకుంటున్నారు. మొదటి విడతలో సుమారు 2,500 సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 30 వేలు, ఖమ్మం 27 వేలు, రంగారెడ్డి 26 వేల మంది సభ్యులు దివ్యాంగుల సంఘాల్లో చేరినట్లు అధికారులు తెలిపారు.

సంఘంలో ఐదుగురు సభ్యులు

Advertisement

గతంలో 65 ఏండ్లు ఉన్నా.. సంఘాల్లో చేర్చుకుని బ్యాంకు లింకేజీ రుణాలు ప్రభుత్వ ఇచ్చేది. కానీ, నాబార్డ్​ నిబంధనల ప్రకారం 60 సంవత్సరాలు ఉన్నవారికే ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కో సంఘంలో ఐదుగురు సభ్యులకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న సంఘాలకే రుణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారు సొంతంగా చిన్నపాటి వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

Also Read: బండి భ‌గీర‌థ్ కేసుపై బీఆరెస్‌ గాయిగ‌త్త‌ర … టీఆరెస్ హుందా ప్ర‌వ‌ర్త‌న‌..!

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా..

Advertisement

దివ్యాంగ సంఘాలకు రుణమే కాదు.. ప్రమాదం జరిగి మృతి చెందినా వారి కుటుంబాలకు భరోసాకు శ్రీకారం చుట్టింది. బ్యాంకు లింకేజీ రుణం పొందిన సభ్యుల్లో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని నిర్ణయించింది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ఆ సభ్యుడు తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేయన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం దివ్యాంగుల కుటుంబాలకు ఊరటనిస్తోంది. అప్పుల బాధ లేకుండా, ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకం దోహదపడనుంది. బ్యాంకు లింకేజీ ద్వారా అందే రుణాలతో దివ్యాంగులు కిరాణా షాపులు, జిరాక్స్ సెంటర్లు, టైలరింగ్, హస్తకళల వంటి పనులను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో ఈ రుణాల పంపిణీ పారదర్శకంగా జరగనుంది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో ముందుకెళ్లే అవకాశం లభించనుంది.

స్వయం ఉపాధికోసం: మంత్రి సీతక్క

దివ్యాంగులు కుటుంబంపై ఆధారపడకుండా స్వశక్తితో ముందుకు సాగేందుకు.. స్వయం ఉపాధి పొందేందుకు పొదుపు గ్రూపులను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 12930 సంఘాలు ఏర్పాటు అయ్యాయి. వాటికి బ్యాంకు లింకేజీతో రుణం ఇప్పిస్తున్నాం. వారు ప్రమాద వశాత్తు మృతి చెందినా ఆ కుటుంబానికి 10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించాం. ఇది వారి కుటుంబానికి భరోసాగా నిలువనుంది.

Also Read: మరోసారి లాక్‌డౌన్ దిశగా భారత్..? ప్రధాని మోదీ హెచ్చరికల వెనుక అసలు నిజమిదే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×