E-Paper
Advertisement

ఇందిరమ్మ చీర రంగును మార్చిన సర్కార్.. ఇకపై చీరలన్నీ ఆ కలర్‌లోనే..?

ఇందిరమ్మ చీర రంగును మార్చిన సర్కార్.. ఇకపై చీరలన్నీ ఆ కలర్‌లోనే..?
Advertisement

Free Sarees: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీర రంగును ఈసారి మార్చింది. ఈ ఏడాది చిలకపచ్చ రంగు(Green color) చీరను పంపిణీ చేయబోతుంది. అందుకు చీరరంగును సెలక్టు చేసి టెస్కోకు ఆర్డర్ సైతం ఇచ్చింది. నవంబర్ 19 ఇందిరాగాంధీ జయంతి(Indira Gandhi Anniversary) నాడు పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

చిలకపచ్చ రంగు చీరలు

ప్రతీ ఏటా ప్రభుత్వం మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తుంది. మహిళా సంఘాలకు గతేడాది ఇందిర మహిళా శక్తిపేరుతో పంపిణీని ప్రారంభించింది. ఈఏడాది సైతం పంపిణీ చేయబోతుంది. అందుకు చీర రంగు, డిజైన్ ను సైతం సెలక్టు చేసింది. చిలకపచ్చ రంగు చీరలు తయారు చేయాలని టెస్కో అధికారులను ప్రభుత్వం ఆదేశాలు సైతం ఇచ్చినట్లు సమాచారం. గతేడాది పంపిణీ చేసిన చీరలు నీలం రంగు కాగా.. ఈసారి చిలకపచ్చ రంగు, ఎరుపు జరీ డిజైన్‌తోఎంపిక చేసింది .ఈ మేరకు సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ) కోటి చీరల తయారీ కోసం టెస్కోకి రూ.450 కోట్లు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ చీరల్ని అక్టోబరు నాటికి సిద్ధం చేసి అన్ని జిల్లాలకు సరఫరా చేయాలని, నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతికి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు సైతం ఇచ్చింది. ఒక్కో చీరకు రూ.450 తో తయారు చేయిస్తున్నారు.

Advertisement

Also Read: షాకింగ్ వీడియో.. రోడ్డు పక్కన కూర్చొని.. పరీక్ష రాస్తున్న విద్యార్థులు.. ఎక్కడంటే?

టెస్కోకి 450కోట్ల ఆర్డర్..

గతేడాది 86లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈసారి పెరిగే అవకాశం ఉండటంతో కోటి చీరలకు ఆర్డర్ ఇచ్చారు. చీరల తయారీకోసం 11 ప్రాంతాల్లోని చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చారు. అందులో సిరిసిల్ల, వరంగల్(Warangal ), హనుమకొండ(Hanumakonda), కరీంనగర్(Karimnagar), జగిత్యాల(Jagithyala), పెద్దపల్లి(Pedda Pally), మంచిర్యాలలో నేత కార్మికులకు ఈ చీరల తయారీ బాధ్యతను అప్పగించబోతున్నారు. నేతలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే. వారికి సంవత్సరం పొడవున ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే మహిళలకు చీరల ఆర్డర్ ను సైతం టెస్కోతో ఇస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలకు ఒకేసారి చీరలు పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: సోషల్ మీడియాపై ఏపీ కొత్త చట్టం.. ఇక వాళ్లకి నో ఎంట్రీ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×