E-Paper
Advertisement

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!
Advertisement

Transfers: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర అటవీ శాఖలో ఒక్కసారిగా ‘అంతర్గత’ బదిలీల వ్యవహారం తీవ్ర చర్చకుదారితీసింది. శాఖ పరిధిలో ఇటీవల జరిగిన ఇంటర్నల్ బదిలీలన్నింటినీ రద్దు చేస్తూ నూతన పీసీసీఎఫ్ జారీ చేసిన సర్క్యులర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, పాత బదిలీల ఉత్తర్వులను తిరగదోడుతూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు అంతర్యమేమిటన్న దానిపై అటు అటవీశాఖ వర్గాల్లో, ఇటు సచివాలయ వర్గాల్లోనూ రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ మినహాయింపు ఎవరి కోసం?

ఈ రద్దు సర్క్యులర్‌లో పేర్కొన్న కొన్ని అంశాలు ఇప్పుడు మరిన్ని అనుమానాలకు, వివాదాలకు తావిస్తున్నాయి. అటవీ శాఖ నుంచి డెప్యుటేషన్‌పై ఇతర శాఖలకు వెళ్లిన వారికి మాత్రం ఈ రద్దు ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అడవులను కాపాడేందుకు బదిలీ అయిన సిబ్బందికి ఒక న్యాయం, ఇతర శాఖల్లో లూప్‌లైన్ పోస్టుల్లో చేరిన వారికి మరో న్యాయమా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్దిష్ట మినహాయింపుల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

Advertisement

Also Read: Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

పట్టు కోసమా?

కొత్త పీసీసీఎఫ్ గా వినయ్ కుమార్ రాగానే ఈ తరహా సంచలన నిర్ణయానికి పూనుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణాలపై అటవీ శాఖలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.క్షేత్రస్థాయి అధికారులపై, యంత్రాంగంపై పూర్తి పట్టు సాధించాలనే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? కింది స్థాయి సిబ్బంది అంతా కచ్చితంగా తమ ‘మాట వినాలి’ అనే గట్టి సంకేతాన్ని పంపేందుకే ఈ బదిలీల రద్దు అస్త్రాన్ని ప్రయోగించారా?లేక గతంలో జరిగిన అంతర్గత బదిలీల్లో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలు జరిగాయనేసమాచారంతోనే ఈ ‘మరమ్మత్తు’కు శ్రీకారం చుట్టారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఉద్యోగుల్లో తీవ్ర చర్చ!

Advertisement

ఈసర్క్యులర్‌తో అటవీ శాఖలోని ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర అయోమయంలో పడ్డారు. అప్పటికప్పుడు సర్దుకుని కొత్త స్థానాల్లో కుదురుకుంటున్న తరుణంలో ఈ రద్దు నిర్ణయం రావడం వారిని విస్మయానికి గురిచేసింది. అసలు ఈ ‘మరమ్మత్తు’ ఎక్కడికి దారితీస్తుంది? మున్ముందు ఇంకెలాంటి కఠిన నిర్ణయాలు ఉంటాయోనని ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏంటనే దానిపై అటవీ శాఖా ప్రధాన కార్యాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు ఎవరికి వారు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

Also Read: Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×