E-Paper
Advertisement

Kodandareddy Nashik visit: నాసిక్‌లో తెలంగాణ రైతు కమిషన్ రెండో రోజు పర్యటన..సహ్యాద్రి ఫార్మ్స్ ఎండీతో కీలక భేటీ

Kodandareddy Nashik visit: నాసిక్‌లో తెలంగాణ రైతు కమిషన్ రెండో రోజు పర్యటన..సహ్యాద్రి ఫార్మ్స్ ఎండీతో కీలక భేటీ
Advertisement

Kodandareddy Nashik visit:  తెలంగాణ రైతు కమిషన్ బృందం నాసిక్ లో రెండో రోజు పర్యటన కొనసాగించింది. పలు వ్యవసాయ క్షేత్రాలను విజిట్ చేసి.. అక్కడి రైతులతో నేరుగా మాట్లాడి పంటల సాగు విధానం, సాగుకయ్యే ఖర్చు, మార్కెటింగ్, లాభనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇక సహ్యాద్రి ఎండీ విలాస్ షిండే తో కమిషన్ బృందం సాయంత్రం భేటీ అయ్యింది. రెండు రోజులుగా నాసిక్ ప్రాంతంలో పర్యటిస్తున్న కమిషన్ బృందానికి విలాస్ షిండే స్వాగతం పలికారు. సహ్యాద్రి క్యాంపస్ లో దాదాపు 2 గంటల పాటు పలు అంశాలపై చర్చించారు. దక్షిణ భారత్ దేశంలో ప్రధానంగా తెలంగాణ లాంటి రాష్ట్రానికి సహ్యాద్రి ఫార్మ్స్ సహకారం కలవాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు.

తెలంగాణలో గోదావరి, కృష్ణ నదులతోపాటు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయని, అన్ని రకాల పంటల సాగుకు సారవంతమైన భూమి ఉందని..  వాతావరణం సైతం అనుకూలంగా ఉంటుందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రైతు బిడ్డా అని, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాలను విలాస్ షిండే కు కోదండరెడ్డి వివరించారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్.. విజన్ -2047లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన విషయం సైతం గుర్తుచేశారు.

Advertisement

తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని తెలిపారు. ఆ దిశగానే సీఎం ప్రస్తుతం దావోస్ లో వున్నారని వివరించారు. సీఎం ఆదేశాల మేరకు కమిషన్ బృందం ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తుందని తెలిపారు. బలమైన FPO లు ఏర్పాటు కావాలని దానికోసం మీలాంటి వారు తెలంగాణకు రావాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.. సహ్యాద్రి ఎండీ విలాస్ షిండే ను రిక్వెస్ట్ చేశారు.

కోదండరెడ్డి ఆహ్వానం మేరకు సహ్యాద్రి ఎండీ విలాస్ షిండే సానుకూలంగా స్పందించారు. కమిషన్ సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డిలు మాట్లాడుతూ.. దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణలోనే రైతు సంక్షేమ కమిషన్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయంపై మక్కువతో కమిషన్ ఏర్పాటు చేశారని, వ్యవసాయంపై అనుభవం వున్న చైర్మన్ కోదండరెడ్డి ఉండడం కూడా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.

Advertisement

ములుగు, గద్వాల్ జిల్లాలో విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన రైతులకు కమిషన్ చొరవ తీసుకొని కంపెనీల నుండి నష్టపరిహారం ఇప్పించినట్లు వివరించారు. రాంరెడ్డి గోపాల్ రెడ్డి , భవానీ రెడ్డిలు సైతం పలు అంశాలపై షిండే డిస్కస్ చేశారు. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మార్కెటింగ్ విధానం, పెట్టుబడి, మూసధోరణిలో సాగు, పంటల మార్పిడి పై చర్చించారు. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో సాగిన పర్యటనలో కమిషన్ సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, మెంబర్ సెక్రెటరీ గోపాల్, కమిషన్ అధికారులు సంధ్యారాణి, హరి, స్రవంతి, రజిత, FPO లు ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.

ALSO READ:జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వాసులకు ఊరట.. రంగంలోకి దిగిన జలమండలి బాస్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×