E-Paper
Advertisement

ఫిఫా ఫైనల్స్ ఎఫెక్ట్.. బార్ల పనివేళల పొడగింపు.. ఇక తెల్లార్లు ఎంజాయ్ పండగో!

ఫిఫా ఫైనల్స్ ఎఫెక్ట్.. బార్ల పనివేళల పొడగింపు.. ఇక తెల్లార్లు ఎంజాయ్ పండగో!
Advertisement

FIFA World Cup: ఫుట్‌బాల్ ప్రేమికులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) క్రేజ్ నేపథ్యంలో నగరంలోని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసేందుకు వీలుగా బార్ల పని వేళలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 18, 19 తేదీల్లో జరిగే ఉత్కంఠభరిత మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ వ్యాప్తంగా బార్లు, క్లబ్‌లు అదనపు సమయం పాటు తెరిచి ఉంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏ రోజు ఎంత సమయం వరకు అంటే..?

Advertisement

ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్, అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల కోసం ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. జులై 18, 19న రాత్రి బార్లు, క్లబ్‌లను తెల్లవారుజామున ఉదయం 4.30 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. అదేవిధంగా.. జులై 19,20 రాత్రి బార్లు, రెస్టారెంట్లను ఉదయం 3 గంటల వరకు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు.

ఎక్కడెక్కడ వర్తిస్తుంది?

Advertisement

బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ అనుమతితో ఎక్సైజ్ కమిషనర్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రత్యేక ఆదేశాలు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పరిమితుల్లో జూలై 17 నుంచే అమల్లోకి వచ్చాయి.

నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే!

పనివేళలు పొడిగించినప్పటికీ, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్సైజ్ శాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలనే కఠినమైన షరతుతోనే ఈ అనుమతులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఏదేమైనా, ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుట్ అవుతూ మ్యాచ్ చూడాలనుకునే నగరవాసులకు ఈ నిర్ణయం ఫుల్ ఖుషీని ఇస్తోంది.

Also Read: ఎల్లంపేట్‌లో అక్రమ నిర్మాణాలు.. ఇళ్ల అనుమతులతో కమర్షియల్ షట్టర్లు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×