E-Paper
Advertisement

Dialysis Centres: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..!

Dialysis Centres: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..!
Advertisement

Dialysis Centres: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్యాన్ని వేగంగా చేరువయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. డయాలసిస్ కేంద్రాలు మరిన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఉన్న 102 ను 180 కేంద్రాలకు పెంచాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నది. దీని వలన రాష్ట్రంలో పేషెంట్లు ఎక్కడ ఉన్నా కేవలం 20 నుంచి 25 నిమిషాల్లోనే డయాలసిస్ కేంద్రానికి చేరుకునేలా నెట్‌వర్క్ ను విస్తరిస్తున్నారు. దీంతో పాటు సనత్‌నగర్ టిమ్స్ లో ‘ట్రాన్స్‌ప్లాంటేషన్ సైన్సెస్’ కోసం మెగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం వైద్యారోగ్యశాఖ పెట్టిన ప్రతిపాదనలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం నియోజకవర్గానికి ఒకటి చొప్పున కేంద్రాలు వర్క్ చేస్తున్నాయి. అయితే వీటిలో డిస్టెన్స్ ఆధారంగా కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మండల కేంద్రాల స్థాయిలలోనూ కొత్త కేంద్రాలు ఏర్పడతాయి. అంతేగాక ఆయా కేంద్రాల్లో పనిచేసేందుకు పూర్తి స్థాయి స్టాఫ్​, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లను కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Also read: BRS And BJP Alliance: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉందా?

తగ్గనున్న ప్రయాణ భారం..?

Advertisement

​గతంలో డయాలసిస్ కోసం రోగులు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ స్థాయి వరకు వెళ్లాల్సి వచ్చేది. కొందరైతే ఇప్పటికీ హైదరాబాద్ వరకు వెళ్తున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 102 ను 180కి పెంచనున్నారు. తద్వారా మారుమూల గ్రామాల రోగులకు కూడా అత్యవసర చికిత్స ఇంటి సమీపంలోనే అందనుంది.దీని వలన పేషెంట్లకు ప్రయాణ, ఆర్​ధిక భారం తగ్గడంతో పాటు గోల్డెన్ అవర్ వంటి పరిస్థితులు మిస్ కాకుండా ఉండాయి. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఏర్పాటు చేయనున్న మెగా డయాలసిస్ సెంటర్ కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, కిడ్నీ మార్పిడి లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేందుకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా సేవలందించనుంది.

Also Read: New Rental Act 2026: కొత్త అద్దె చట్టం.. అద్దెదారులకు భారీ ఊరట.. ఇకపై అగ్రిమెంట్ తప్పనిసరి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×