E-Paper
Advertisement

TG Endowments Budget: గోదావరి పుష్కరాలకు 400 కోట్లు.. ఆలయాల ముస్తాబుకు మాస్టర్ ప్లాన్..!

TG Endowments Budget: గోదావరి పుష్కరాలకు 400 కోట్లు.. ఆలయాల ముస్తాబుకు మాస్టర్ ప్లాన్..!
Advertisement

TG Endowments Budget: ఏడాదిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు దేవాదాయశాఖ బడ్జెట్ రూపకల్పన చేసింది. ఏయే పనులకు ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. అందులో గోదావరి పుష్కరాలకే సింహభాగం కేటాయించినట్లు తెలిసింది. మిగతా నిధులు ఉద్యోగులు, డీడీఎన్ ఎస్, సీజీఎఫ్ నిధులు కావాలని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయిస్తుందనేది ఆసక్తి నెలకొంది. గత బడ్జెట్ లో ఎండోమెంట్ కు నిధులు కేటాయింపులు చేసినా రిలీజ్ మాత్రం రెండంకెలు దాటలేదని సమాచారం.

2027లో జరుగనున్న పుష్కరాలు..

త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అయితే దేవాదాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నిధుల కేటాయింపుపై అంచనాలు రూపొందించి నివేదిక అందజేసినట్లు సమాచారం. రూ.580కోట్ల పనులకు సంబంధించినప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. అందులో సింహభాగం నిధులు రాబోయే గోదావరి పుష్కరాలకే కేటాయించినట్లు తెలిసింది. ఇప్పటికే 2027లో జరుగనున్న పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. నిధులసమీకరణపై దృష్టి సారించింది. ఈవార్షిక బడ్జెట్‌లో శాఖాపరంగా కేటాయింపులతో కూడిన నివేదికను రూపొందించింది. ప్రధానంగా గోదావరి పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్ల కోసమే సుమారు 400కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించిందని విశ్వసనీయ సమాచారం. ఎండోమెంట్ శాఖలోనిఅర్చకులు, ఉద్యోగుల జీతభత్యాలు, ధూపదీప నైవేద్యాల స్కీమ్ (డీడీఎన్‌ఎస్), కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిర్వహణకు మరో రూ.180 కోట్లు అవసరమనిఅందులో పేర్కొంది.

Advertisement

Also Read: Tollywood: మేము కమిట్‌మెంట్ కష్టాలు ఫేస్ చేయలేదు.. ప్రతి నోటా ఇదే మాట!

వసతుల కల్పనపై నివేదిక..

గోదావరి పుష్కర ఏర్పాట్లకు ఇప్పటికే ప్రభుత్వం సిద్దమైంది. ఘాట్లు, భక్తులకు వసతుల కల్పనపై నిమగ్నమైంది. గోదావరి పరిహాక ప్రాంతాల వివరాలు, ఆలయాలు, చేయాల్సిన అభివృద్ధి పనులపై అధికారుల నుంచి నివేదికను సైతం ప్రభుత్వం తెప్పించుకుంది. దేవాదాయశాఖ సైతం ఆలయాల వద్ద వసతుల కల్పనపై నివేదిక ఇచ్చారు. ఈఆర్థిక సంవత్సరంలోనే సివిల్ వర్క్స్ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ఈ బడ్జెట్‌లో నిధులు ఇందుకోసం కేటాయించాలని ఎండోమెంట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గోదావరి తీరంలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రధాన క్షేత్రాలతోపాటు చిన్న ఆలయాల వద్ద స్నానపు ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టనున్నారు.పుష్కరాలకువచ్చే భక్తులకు షెడ్ల నిర్మాణం, తాగునీరు, డ్రెస్సింగ్ రూమ్స్, క్యూ లైన్ల ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఆలయాలకు వెళ్లే అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆలయాలకు పునర్ వైభవం

Advertisement

శాఖ నిర్వహణ కోసం 180కోట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో ఉద్యోగుల జీతభత్యాలు, దూపదీప నైవేద్యం స్కీం, కామన్ గుడ్ ఫండ్ నిర్వహణకోసం అవసరం అని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. గత బడ్జెట్ లో సుమారు రూ.175 కోట్లుపైగా కేటాయించగా.. రూ.50 కోట్ల వరకు రిలీజ్​ చేసినట్లు సమాచారం.డీడీఎన్ఎస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6800 వరకు ఆలయాలకు ప్రతి నెలా ఆలయానికి 10వేల చొప్పున సుమారు 6.8కోట్లు అందజేస్తున్నారు. మరికొన్నికొత్త ఆలయాలను సైతం ఈ పథకంలో చేర్చబోతున్నారు. దీంతో అదనపు నిధులు అవసరం కానున్నాయి. దీనికి తోడు సీజీఎఫ్ తో పురాతన ఆలయాల పునరుద్ధరణకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాల్సి ఉందని నిధులు పెంచాలని అధికారులు కోరినట్లు సమాచారం. ఆలయాలకు పునర్ వైభవం రావాలంటే బడ్జేట్ లో నిధులు గతం కంటే ఎక్కువగా కేటాయించాలని అధికారులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. అధికారులు అందజేసిన విధంగా బడ్జెట్ లో ఏమేరకు నిధులు కేటాయిస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం దృష్టిసారిస్తే తప్ప బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరుగదని అధికారులు పేర్కొంటున్నారు.

Also Read: AI Abuse Engineer: మనుషులను తిట్టేస్తున్న ఏఐ.. కోడింగ్ తప్పుపట్టాడని ఇంజినీర్‌పై ఏఐ బాట్ ఆగ్రహం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×