E-Paper
Advertisement

Data Entry Operators: వీరి సమస్యకు పరిష్కారం లేదా? అయోమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరిస్థితి!

Data Entry Operators: వీరి సమస్యకు పరిష్కారం లేదా? అయోమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరిస్థితి!
Advertisement

Data Entry Operators: ఏ పనిచేయకుండా ఒకే పనిపై జీవించే కుటుంబం రోడ్డు పాలయ్యై పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టుగా అధికారులు నివేధికలు ఇవ్వడం లేదని సమాచారం. దీంతో తహశీల్ధార్​ కార్యాలయంలో పనిచేసే డాటా ఎంట్రీ ఆపరేటర్ల ను ఈ ఏడాది తర్వాత రెన్యూవల్​ చేయోద్దని ప్రభుత్వం సర్క్యులర్​ విడుదల చేశారు. ఈ సర్క్యూలర్​తో ఆపరేటర్లు ఆమోయంగా రోజు రోజుకు జీవనం సాగిస్తున్నారు. గత 20 యేండ్లకు పైగా అదే పనిలో నిమగ్నమై జీవనం గుడుపుతున్న కుటుంబాలకు పిడుగు పడ్డట్టుగా ప్రభుత్వ నిర్ణయం ఉందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్​ పద్దతిలో నియామకం చేసుకున్న ఆపరేటర్లను కొనసాగించడం.. యేండ్లుగా పనిచేసే వాళ్లను తప్పించే ప్రయాత్నం ప్రభుత్వం చేయడంపై ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో 632 కుటుంబాలపై ప్రభావం

రాష్ట్రంలో 632 మంది ఔట్​ సోర్సింగ్​ పద్దతిలో తహశీల్ధార్​ కార్యాలయాల్లో పనిచేస్తున్నట్లు సమాచారం. వీరందరిని ఈ ఏడాది చివరి నాటికే పరిమితం చేస్తూ తిరిగి రెన్యూవల్​ చేసుకోవద్దని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఉత్తర్వులతో ఆపరేటర్ల మనస్సు కలిచివేత దిశగా ఆలోచన చేస్తున్నారు. తప్పిదాలు చేస్తూ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని బాధితులు సూచిస్తున్నారు. కానీ ఏకారణం లేకుండా పక్కకు పెట్టాలనే ఆలోచనతో మా కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితి ఉందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. 2004లో అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్​ ఈ ఆపరేటర్లను నియామకం చేసుకుంది. వీరి నియామకంతో భూ రికార్డుల ప్రక్షాళన కోసం సీఎంఆర్​వో ప్రాజెక్ట్ నేతృత్వంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఎంపిక చేశారు. ఈ ఆపరేటర్ల సహాయంతో భూ రికార్డులను వ్రాసేందుకు ఉపయోగించుకున్నారు. వీరి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏలాంటి నిర్ణయం తీసుకున్న కుటుంబాలు రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉందని తెలుస్తోంది.

ధరణితోనే తప్పిదాలు  కదా?

Advertisement

గత ప్రభుత్వం తీసుకోచ్చిన ధరణితోనే తప్పిదాలు జరిగాయని కాంగ్రెస్​ ప్రభుత్వం భావిస్తోంది. అలాంటప్పుడు ఆ ధరణిలో నిపుణులైన ఆపరేటర్లపై ప్రేమ ఎందుకని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కేవలం డాట ఎంట్రీ ఆఫరేటర్ల పై విముఖత ఎందుకనే అనుమానాలున్నాయి. ధరణి వెబ్ సైట్తో పాటు భూ భారతితో తలెత్తే సమస్యలకు ప్రధాన కారాకులు ఆపరేటర్లు కదా అనే సందేహాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దరణి ఆపరేటర్లపై ప్రేమ చూపించి, డాటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించే కుట్రను నిలదీస్తున్నారు. ధరణిలో కూడా సుమారుగా 65‌‌0 మంది ఆపరేటర్లు పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ధరని ఆపరేటర్లు చేసిన భూ లావాదేవీలు ప్రభుత్వానికి మచ్చ తీసుకోచ్చాయి. ఇలా వెలుగులోకి రాకుండా ఉన్న జిల్లా ల పరిస్థితి ఎంటో అర్దమైతుంది. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం డాటా ఎంట్రీ ఆపరేటర్ల పై తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు.

Also Read: Ugadi Special Trains: ఉగాది పండుగకు ప్రత్యేక రైళ్లు, ఏ రూట్లలో నడుస్తాయంటే?

డేటా ఎంట్రీ ఆపరేటర్ల పొట్ట కొట్టదు 

Advertisement

రాష్ట్రంలోని ప్రతి మండలంలోని తహశీల్ధార్​ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు చిపురు ఊడ్చుడు తప్పా అన్ని పనులు వాళ్లే చేస్తారు. ల్యాండ్​ రికార్డ్స్​, ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యాకలపాలతో పాటు రేషన్​ కార్డు, మీ సేవ, డ్రాఫ్టీంగ్​, లేటర్లు తయారిలో నిమగ్నమైతారు. అంతేకాకుండా ప్రతి రోజు మీసేవ ధ్వారా వచ్చే దరఖాస్తులను ఆపరేటర్ పరిశీలించి అధికారులతో సమన్వయం చేసుకుంటారు. ఇలాంటి అన్ని పనులు చేసే డాటా ఎంట్రీ ఆపరేటర్ల పొట్ట కొట్టదోని వేడుకుంటున్నారు.

ఐఎప్​ఎంఎస్​తో ఆర్ధిక భారం తగ్గింపు

రాష్ట్ర ప్రభుత్వం ఔట్​ సోర్సింగ్ పద్దతిలో పనిచేసే ఉద్యోగులకు ఐఎఫ్​ఎంఎస్​ పద్దతి ద్వారా వేతనలు ఇవ్వడంతో సామాన్యుడు పరిపుష్టిగా జీవించగలుగుతాడని సమాచారం. 2020 పీఆర్సీ ప్రకారం ఔట్ సోర్సింగ్​ పద్దతిలలో పనిచేసే సామాన్యుడికి ఉపాధి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఆ పీఆర్​సీ ప్రకారం ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకు కేటాయించిన వేతనాలు చేతికందడం లేదు. రూ.24వేలకు గాను కేవలం రూ.17వేల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో మధ్యవర్తులతో పాటు ప్రభుత్వానికి నష్టమే చేకురుతుందని తెలుస్తోంది. ఇచ్చే రూ.17వేలగానీ రూ.24వేలకు ప్రభుత్వానికి సుమారుగా బిల్లులు చేయడంతో రూ.30వేల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో జీఎస్టీ, కమీషన్​ ఎజెంట్కు 21శాతం ఉండటంతోనే ఆర్ధిక భారం పడుతుంది. కానీ ఐఎఫ్​ఎంఎస్​ కింద వేతనాలు చెల్లిస్తే ఆర్ధిక భారం ప్రతి ఆపరేటర్​పై సుమారుగా రూ.10వేల వరకు తగ్గుతుందని సమాచారం.

ప్రభుత్వానికి ఆర్ధక భారం

మాకు భరోసా కల్పించండీ సారూ…  కొట్ల రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర టెక్నకల్ ఆసోషియేషన్​ అధ్యక్షుడు, ఉపాధి అవకాశం కల్పించిన ఆనాటీ కాంగ్రెస్​ ప్రభుత్వమే. ఆప్రభుత్వం అధీనంలో ప్రవేశం కల్పిస్తే… ఈనాటీ ప్రభుత్వం తొలగింపునకు చర్యు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ వేతనాలకు ఎంతో కాలంగా ప్రభుత్వంపై నమ్మకంతో పనిచేస్తున్నాము. ఐఎఫ్ఎంఎస్తో వేతనాలు ఇస్తే ఆర్ధిక భారం తగ్గుతుందన్నారు. అధనంగా చెల్లించే నగదుతో ప్రభుత్వానికి ఆర్ధక భారం పడుతుంది. ప్రతి ఉద్యోగిపై సుమారుగా రూ.10వేల తగ్గంచే అవకాశం ఉంది. ఎంతో మంది పేద, మధ్య తరగతి కుటుంబాలు రోడ్డుపై పడే అవకాశం ఉంది. ఈ నిలుపుదలను నిలిపివేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Also Read: Double Murder: పటాన్‌చెరులో కిరాతకం.. అర్థరాత్రి వాచ్‌మెన్ దంపతులపై రాడ్లతో అటాక్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×