E-Paper
Advertisement

IPS officer Transfers: తెలంగాణలో ఐపీఎస్‌‌‌ల‌‌‌‌‌‌ బదిలీలు..

IPS officer Transfers: తెలంగాణలో ఐపీఎస్‌‌‌ల‌‌‌‌‌‌ బదిలీలు..
Advertisement

10 మంది ఐపీఎస్‌ల బదిలీ
ఏఎస్పీలుగా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: IPS officer Transfers: రాష్ట్రంలో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని వేర్వేరు జిల్లాలకు ఏఎస్పీలుగా నియమించారు. వీరంతా 2021-22 బ్యాచ్‌‌కు చెందిన అధికారులు. కొత్త పోస్టింగులు పొందినవారు వెంటనే విధుల్లో చేరాలని, ఇప్పటికే పనిచేస్తున్నవారి నుంచి బాధ్యతలను స్వీకరించాలని సీఎస్ తెలిపారు. పాత అధికారుల్లో కొందరు హెడ్ క్వార్టర్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

కాజల్‌ను గ్రేహౌండ్స్ ఏఎస్పీ నుంచి ఉట్నూరు ఏఎస్పీగా, కంకణాల రాహుల్‌ రెడ్డిని గ్రేహౌండ్స్ ఏఎస్పీ నుంచి భువనగిరి ఏఎస్పీగా, చిత్తరంజన్‌ను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి ఆసిఫాబాద్ ఏఎస్పీగా, చైతన్య రెడ్డిని ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి కామారెడ్డి ఏఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. చేతన్ నితిన్‌ను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి జనగామ ఏఎస్పీగా, విక్రాంత్ కుమార్ సింగ్‌ను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి భద్రాచలం ఏఎస్పీగా బదిలీ చేశారు.

Also Read: Harish Rao – KCR: కేసీఆర్ ఇక సభకు రానట్లేనా.. సంతాప తీర్మానానికి డుమ్మా.. బీఆర్ఎస్‌లో అసంతృప్తి?

Advertisement

అక్కడి ఏఎస్పీ అంకిత్ కుమార్‌ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని సూచించింది. ఇక, శుభం ప్రకాశ్‌ను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా, రాజేశ్ మీనాను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి నిర్మల్ ఏఎస్పీగా, మౌనికను ఏఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి దేవరకొండ ఏఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×